Breaking News

ప్రభుత్వ బ్యాంకులనూ వదలని ఆర్‌బీఐ - రూ.10.34 కోట్లు ఫైన్!

Published on Fri, 11/24/2023 - 20:03

గత కొన్ని రోజులుగా నిబంధనలను అతిక్రమిస్తున్న బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్‌బీఐ) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేయడమే కాకుండా కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు కోట్ల రూపాయాల ఫైన్ వేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు ఈ రోజు రూ. 10.34 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda)
ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ అయిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా'పై ఆర్‌బీఐ ఏకంగా రూ. 4.34 కోట్లు జరిమానా విధించింది. కామన్ ఎక్స్‌పోజర్‌ సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేయడంలో RBI ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank)
ప్రభుత్వ రంగంలోని మరో దిగ్గజ బ్యాంక్ 'ఇండియన్ ఓవర్సీస్'పై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయలు జరిమానా విధించింది. బ్యాంక్ లోన్స్, అడ్వాన్సులకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్‌ హ్యాండ్‌ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..

సిటీ బ్యాంక్ (City Bank)
ప్రైవేట్ రంగంలో 'సిటీ బ్యాంక్'పై RBI ఏకంగా రూ. 5 కోట్లు ఫైన్ వేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్‌ విధానాలను అమలు చేయడంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించడం వల్ల ఈ జరిమానా విధించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)