Breaking News

షాక్‌లున్నా ఎకానమీ ఓకే

Published on Wed, 07/01/2026 - 04:31

ముంబై: అంతర్జాతీయంగా ఎదురవుతున్న షాక్‌లను దీటుగా ఎదుర్కొనేలా ఆర్థిక సంస్థల బ్యాలెన్స్‌ షీట్లు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీ ఎకానమీ పటిష్టంగా ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. మూలధనం, లిక్విడిటీ సమృద్ధిగా ఉండటం, అసెట్‌ క్వాలిటీ మెరుగుపడుతుండటం, లాభదాయకత స్థిరంగా ఉండటంలాంటి అంశాల దన్నుతో షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు (ఎస్‌సీబీ) సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.

మంగళవారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ విషయాలు వెల్లడించింది. షాకుల్లాంటివి ఏవైనా తలెత్తినా, తట్టుకుని నిలబడే సత్తా బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు ఉన్నట్లు స్ట్రెస్‌ టెస్టుల్లో వెల్లడైనట్లు వివరించింది. అటు నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల అసెట్‌ క్వాలిటీ, లాభదాయకత కూడా మెరుగుపడుతోందని వివరించింది.

‘భారీ స్థాయిలో అంతర్జాతీయంగా షాక్‌లు ఎదురవుతున్నప్పటికీ భారత ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ చెప్పుకోతగ్గ స్థాయిలో పటిష్టంగా నిలుస్తున్నాయి. పటిష్ట వృద్ధి, ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, నిధుల లభ్యత పుష్కలంగా ఉండటంలాంటి అంశాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో తోడ్ప డుతున్నాయి’ అని ఎఫ్‌ఎస్‌ఆర్‌ ముందుమాటలో ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు.  

నివేదికలోని మరిన్ని విశేషాలు.. 
⇒ సైబర్‌ ముప్పులపరంగా చూస్తే సమీప భవిష్యత్తులో ఏఐ ఆధారిత సైబర్‌ దాడుల రిస్కులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి.  
⇒ ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ ఉత్పాదకతపరంగా ఏఐతో ప్రయోజనాలు ఒనగూరవచ్చన్న ఆశాభావంతో గ్లోబల్‌ ఎకానమీ పటిష్టంగానే ఉంది. 
⇒ భారతీయ బ్యాంకుల్లో స్థూల మొండిబాకీలు పలు దశాబ్దాల కనిష్ట స్థాయి 1.8%కి తగ్గాయి. పరిస్థితులు ఎంత దిగజారినా 2028 మార్చి ఆఖరు నాటికి 1.9%కి మాత్రమే పెరగొచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)