Breaking News

ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు

Published on Wed, 07/31/2024 - 13:24

బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను (విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌) నిరోధించడానికి బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక చర్యలను చేపట్టింది. వీరి వర్గీకరణపై తుది మార్గదర్శకాలను జారీ చేసింది.

ఆర్‌బీఐ వివరాల ప్రకారం..రుణ ఖాతాలు మొండి బకాయిగా మారిన ఆరు నెలల లోపు విల్‌ఫుల్‌ డిఫాల్టర్లను నిర్దిష్టంగా గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేక కమిటీ పరిశీలిస్తూ ఉండాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల ఫొటోలను ప్రచురించాలి. ఎగవేతదారుకు, అతనికి సంబంధమున్న ఏ కంపెనీకీ అదనపు రుణ సదుపాయాలను అందించరాదు. ఎగవేతదార్ల జాబితా నుంచి బ్యాంకులు సదరు వ్యక్తి పేరును తొలగించిన ఏడాది వరకు ఇది అమల్లో ఉండాలి.

ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!

తాజా మార్గదర్శకాలు బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్‌), నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) వంటి ఆర్థిక సంస్థలకు వర్తిస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బకాయి మొత్తం రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండి, రుణగ్రహీత లేదా గ్యారెంటార్‌ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన పక్షంలో దాన్ని ‘విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌’గా వ్యవహరిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)