Breaking News

ఆర్‌బీఐ రూటెటు? రేటు పెంపు తప్పదా?

Published on Tue, 10/06/2026 - 02:36

ముంబై: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ముదరడం.. దేశీయంగా ధరల పెరుగుదల రిసు్కలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరికళ్లూ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) మీదే ఉన్నాయి. ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. బుధవారం (7న) తీసుకోబోయే నిర్ణయంలో మళ్లీ కఠిన పాలసీ దిశగా అడుగులు వేయొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

గడిచిన నాలుగు సమీక్షల్లో వడ్డీరేట్లను యాథాతథంగా కొనసాగించినప్పటికీ... ఇక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు అడ్డుకట్టవేసేందుకు ఈసారి పావు శాతం రేట్ల పెంపు ఉండొచ్చని తాజా సర్వేలో 16 మంది ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో సెంట్రల్‌ బ్యాంకు రెపో రేటును పావు శాతం పెంచి 6.5 శాతానికి చేర్చింది. అయితే, ఆతర్వాత 2023–24 మిగతా కాలంలో వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. 2025లో మళ్లీ వరుసగా రేట్ల కోతతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. కాగా, ఆహార, ఇంధన ధరల సెగతో ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 8 నెలల గరిష్టానికి (4.82 శాతం) ఎగబాకిన సంగతి తెలిసిందే.

రెండు విడతల్లో పావు శాతం... 
ఆహార, ఇంధన ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తోంది. ఆగస్టు ఎంపీసీ మినిట్స్‌లో కఠిన వైఖరి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్, డిసెంబర్‌ సమీక్షల్లో చెరో పావు శాతం చొప్పున రేట్లు పెరుగుతాయని భావిస్తున్నాం. అలాగే ఎంపీసీ ప్రస్తుతం ఉన్న ‘తటస్థ‘ విధానం నుంచి ’క్రమానుగతమైన కఠిన విధానం’ లేదా ‘సానుకూల విధానం ఉపసంహరణ’కు మొగ్గుచూపవచ్చు. 
– గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజా నివేదిక

ఈసారీ పాజ్‌ ఉండొచ్చు... 
ఈసారికి ఆర్‌బీఐ పాలసీ రేట్ల జోలికి వెళ్లకపోవచ్చు. యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉంది. అయితే, తదుపరి వడ్డీరేట్ల పెంపు బాటలో 0.5–0.75 శాతం మేర రెపో రేటు పెరిగే చాన్సుంది. మరో విడత పాజ్‌తో బాండ్‌ ఈల్డ్స్‌ కూడా కాస్త నిదానిస్తాయి. ఖరీఫ్‌ దిగుబడి, సెపె్టంబర్‌–డిసెంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను అంచనా వేశాక డిసెంబర్‌లో నిర్ణయం తీసుకోవడం సముచితంగా ఉంటుంది. 
– మదన్‌ సబ్నవిస్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకనమిస్ట్‌

అర శాతం పెంచినా ఆశ్చర్యం లేదు... 
ప్రపంచవ్యాప్తంగా బాండ్‌ రాబడులు (ఈల్డ్స్‌) భారీగా పెరగడం చూస్తుంటే.. ఆర్‌బీఐ రెపో రేటును అర శాతం పెంచినా ఆశ్చర్యం లేదు. కనీసం పావు శాతమైనా వడ్డీరేట్ల పెంపు ఖాయం. 
– వినీత్‌ నహతా, పవర్‌ గిల్ట్‌ ట్రెజరీస్‌ డైరెక్టర్‌

#

Tags : 1

Videos

నిన్నే అడుగుతున్న... పెనుకొండలో ఉషశ్రీ చరణ్ భారీ ధర్నా

రజినీతో క్లాష్ మిస్... దుల్కర్ తో క్లాష్ ఫిక్స్..

జూలైలోనే విమానం కూల్చేందుకు కుట్ర... సంచలన విషయాలు

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

బాల్కనీ నుంచి జారిన చిన్నారి.. చివరి క్షణంలో ఎలా కాపాడాడంటే!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెలివరీ బాయ్‌పై భార్యాభర్తల దాడి

ఫ్యాన్ కోసం సెక్యూరిటీని లెక్కచేయని ధావన్

తాట తీస్తాం చుట్టమల్లే డీప్ ఫేక్ పై నాగవంశీ వార్నింగ్

రాజకీయ ప్రయాణం బుక్ స్థితప్రజ్ఞుడు YS జగన్..

Photos

+5

మూవీ రిలీజ్ తర్వాత మళ్లీ ట్రెండింగ్‌లో నక్షత్ర (ఫొటోలు)

+5

ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్ కళ్యాణ్’మూవీ హీరోయిన్ మహిమ నంబియార్ (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ 'దేశీ గర్ల్' లుక్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్ : ఏపీలో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు...(ఫొటోలు)

+5

టెన్నిస్‌ కోర్టులో నటి వర్ష డిసౌజా.. (ఫొటోలు)

+5

రష్మిక రణబాలి లుక్‌.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : దుర్గామాతకు జైకొడదాం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : సందడిగా దక్కన్‌ డెర్బీ మీట్‌ (ఫొటోలు)