Breaking News

రూ.26,000 కోట్ల విలువైన బిడ్లను తిరస్కరించిన ఆర్‌బీఐ

Published on Fri, 02/21/2025 - 10:00

బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సులభతరం చేయడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 91 రోజులు, 182 రోజులకు సంబంధించిన ట్రెజరీ బిల్లుల వేలానికి వేసిన బిడ్లను తిరస్కరించింది. ఈ బిడ్ల విలువ రూ.26,000 కోట్లుగా ఉంది. ఫారెక్స్ మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం, డాలర్లను విక్రయించడం, రూపాయి లిక్విడిటీని తగ్గించడం వంటి నగదు సంక్షోభం పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.

ట్రెజరీ బిల్లులు

ట్రెజరీ బిల్లులను సాధారణంగా టీ-బిల్లులు అని పిలుస్తారు. ఇవి నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసే స్వల్పకాలిక రుణ సాధనాలుగా తోడ్పడుతాయి. అవి ప్రామిసరీ నోట్ల రూపంలో ఉంటాయి. ఒక సంవత్సరంలోపు లేదా నిర్ణీత గడువులోపు తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. టీ-బిల్లుల కాలపరిమితి 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు. ఇతర రకాల ప్రభుత్వ బాండ్ల మాదిరిగా కాకుండా టీ-బిల్లులకు కాలానుగుణ వడ్డీ సమకూరదు. దానికి బదులుగా, అవి వాటి ముఖ విలువ(ఫేస్‌ వాల్యూ)కు డిస్కౌంట్‌ను అందిస్తాయి. కొనుగోలు ధర, ముఖ విలువ మధ్య వ్యత్యాసం పెట్టుబడిదారు​లకు సంపాదించిన వడ్డీని సూచిస్తుంది. టీ-బిల్లులను సురక్షితమైన, అత్యంత లిక్విటిడీ పెట్టుబడుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే వీటికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. తక్కువ మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి.

ఇదీ చదవండి: 2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!

బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితుల కారణంగా తాజాగా 91 రోజులు, 182 రోజుల టీ-బిల్లుల కోసం వేసిన బిడ్లను ఆర్‌బీఐ తిరస్కరించింది. కానీ, 364 రోజుల టీ-బిల్లుల కోసం రూ.7,000 కోట్ల విలువైన బిడ్లను మాత్రం ఆమోదించింది. సాధారణంగా ట్రెజరీ బిల్లులను ద్రవ్య మార్కెట్(మనీ మార్కెట్‌) సాధనాలుగా జారీ చేస్తారు. ఈ టీ-బిల్లులకు ఇన్వెస్టర్లు ఆఫర్ చేసే రేట్లు ఆర్‌బీఐ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ పార్టిసిపెంట్స్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు పరోక్షంగా దోహదం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)