Breaking News

భవిష్యత్‌ కరెన్సీ అవసరాలకు తగ్గ ప్రణాళిక

Published on Mon, 09/16/2024 - 06:26

న్యూఢిల్లీ: కరెన్సీ నిర్వహణ సదుపాయాలను వచ్చే 4–5 ఏళ్లలో సంపూర్ణంగా పునర్‌నిర్మించాలని ఆర్‌బీఐ ప్రణాళికతో ఉంది. ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధితో భవిష్యత్తులో ఏర్పడే కరెన్సీ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, స్టోరేజ్‌ (నిల్వ) వసతులు మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. గ్రీన్‌ఫీల్డ్‌ కరెన్సీ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, నిల్వ కేంద్రాల ఆటోమేషన్, సెక్యూరిటీ, సరై్వలెన్స్‌ వ్యవస్థల ఏర్పాటు, ఇన్వెంటరీ నిర్వహణ విధానం, కేంద్రీకృత నిర్వహణ కేంద్రం ఇవన్నీ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. 

ఈ మొత్తం ప్రాజెక్ట్‌ అమలు కాలం 4–5 ఏళ్లుగా ఉంది. కరెన్సీ నిర్వహణ వసతుల ఆధునికీకరణకు సంబంధించి కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవల కోసం ఆర్‌బీఐ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)లకు ఆహా్వనించింది. ఈ డాక్యుమెంట్‌ను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. ‘‘గడిచిన మూడేళ్లలో చలామణిలో ఉన్న నోట్ల పెరుగుదల మోస్తరుగా ఉన్నప్పటికీ, వచ్చే దశాబ్ద కాలంలో దాని వేగం మందగించే అవకాశం ఉంది. అయినా కానీ సమీప కాలంలో వృద్ధి సానుకూలంగా ఉంటుందని విశ్లేషణ తెలియజేస్తోంది.

 గడిచిన రెండు దశాబ్దాల్లో చలామణిలో ఉన్న నోట్లు చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. 2023 మార్చి 31 నాటికి 136.21 బిలియన్‌ పీసుల నోట్లఉండగా, 2024 మార్చి 31 నాటికి 146.88 బిలియన్‌ పీసులకు పెరిగాయి. కాయిన్ల చలామణి సైతం ఇదే కాలంలో 127.92 బిలియన్‌ పీసుల నుంచి 132.35 బిలియన్‌ పీసులకు వృద్ధి చెందింది’’అని ఆర్‌బీఐ టెండర్‌ డాక్యుమెంట్‌ పేర్కొంది. ఈ పెరిగే అవసరాలకు తగ్గట్టు సదుపాయాలను మెరుగుపరుచుకునే క్రమంలో భాగంగా ఆర్‌బీఐ ఈవోఐలకు ఆహా్వనం పలికింది.   
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)