Breaking News

మరణించిన వారి ఖాతాలకు ఇక సత్వర పరిష్కారం 

Published on Sat, 09/27/2025 - 05:11

ముంబై: మరణించిన వ్యక్తులకు సంబంధించి డిపాజిట్‌ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్‌లను 15 రోజుల్లోగా పరిష్కరించాలంటూ ఆర్‌బీఐ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఆలస్యం చేస్తే నామినీలకు పరిహారం చెల్లించాలని పేర్కొంది. మరణించిన వ్యక్తుల ఖాతాల క్లెయిమ్‌ల విషయంలో బ్యాంకులు భిన్నమైన పద్ధతులను అనుసరిస్తుండడంతో సేవల నాణ్యతను పెంచే దిశగా ఆర్‌బీఐ ఏకరూప నిబంధనలు తీసుకొచి్చంది.

 వీటిని సాధ్యమైనంత త్వరగా, 2026 మార్చి 31లోపు అమలు చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. నామినేషన్‌ లేదా సరై్వవర్‌షిప్‌ తో డిపాజిట్‌ ఖాతా తెరిచినట్టయితే.. సంబంధిత డిపాజిటర్‌ మరణానంతరం నామినీ లేదా సర్వైవర్‌షిప్‌కు బ్యాలన్స్‌ను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాలకు నామినీ లేదా సర్వైవర్‌షిప్‌ క్లాజు లేకపోతే.. నిర్దేశిత మొత్తం లోపు బ్యాలన్స్‌ ఉన్న సందర్భాల్లో సులభతర చెల్లింపుల నిబంధనలు పాటించాలని ఆర్‌బీఐ పేర్కొంది. 

కోఆపరేటివ్‌ బ్యాంకులకు ఈ పరిమితిని రూ.5 లక్షలు, ఇతర బ్యాంక్‌లకు ఇది రూ.15 లక్షలుగా నిర్ణయించింది. అంటే మరణించిన వ్యక్తి ఖాతాలకు సంబంధించిన బ్యాలన్స్‌ ఇంతకులోపు ఉండి, నామినేషన్‌ లేదా సర్వైవర్‌షిప్‌ నమోదు లేని సందర్భాల్లో బ్యాంకులు వారసులకు సులభతర క్లెయిమ్‌కు వీలు కల్పించాల్సి ఉంటుంది. ఈ పరిమితికి మించి బ్యాలన్స్‌ ఉంటే అప్పుడు సక్సెషన్‌ సరి్టఫికెట్‌ లేదా లీగల్‌ హైయిర్‌ (చట్టబద్ధ వారసులుగా ధ్రువీకరణ) సర్టిఫికెట్‌ను బ్యాంక్‌లు అడగొచ్చు. క్లెయిమ్‌ నమోదు చేసి, డాక్యుమెంట్లు సమరి్పంచిన నాటి నుంచి 15 రోజుల్లో బ్యాంకులకు పరిష్కరించాలి.  జాప్యానికి కారణాలు బ్యాంకుల వైపు ఉంటే, డిపాజిట్‌ ఖాతాలోని బ్యాలన్స్‌పై బ్యాంక్‌ రేటుకు అదనంగా 4% చొప్పున వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. లాకర్‌కు సంబంధించి క్లెయిమ్‌ను జాప్యం చేస్తే రోజుకు రూ.5,000 చొప్పున చెల్లించాలని ఆర్‌బీఐ పేర్కొంది.  

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)