ఆర్‌బీఐ కొత్త రూల్: ఎంతో మేలు

Published on Sun, 01/19/2025 - 17:12

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. బ్యాంక్ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించడానికి కావలసిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలలో పెద్ద సంఖ్యలో డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేదని వెల్లడించింది. తప్పనిసరిగా ఖాతాదారులకు నామినీలు ఉండాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.

మరణించిన డిపాజిటర్ల ఖాతాలో డబ్బు ఉన్నట్లయితే.. దానిని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని నివారించడానికి ఆర్‌బీఐ ఈ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులు లేదా కొత్త ఖాతాదారులందరికీ.. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు, సేవింగ్స్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లు వంటివి ఉన్నట్లయితే వారందరికీ నామినీలు ఉండేలా చూడాల్సిందిగా ఆర్‌బీఐ చెప్పింది.

అర్హత కలిగిన వ్యక్తి నామినీ అయితే.. మరణించిన వ్యక్తి పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా సేఫ్ డిపాజిట్ లాకర్ల నుంచి నిధులను ఎటువంటి సమస్య లేకుండానే బదిలీ చేయవచ్చు.

ఖాతాదారులు.. నామినీలను కలిగి ఉన్నారా లేదా అనే విషయాలను గురించి బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకు ఓ సారి.. దీనికి సంబంధించిన వివరాలను కూడా తెలియజేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. డిపాజిట్ అకౌంట్లకు సంబంధించిన దరఖాస్తు పత్రాలలో కూడా.. నామినీ పేరును తెలియజేసేలా, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.

నామినీ ఎవరు?
ఖాతాదారుడు మరణిస్తే.. తమ నిధులను ఎవరికి బదిలీ చేయాలనుకుంటున్నాడో అతడే.. నామినీ. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో నామినీ పేరును చేర్చవచ్చు లేదా అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత అయినా నామినీ పేరును యాడ్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: క్రెడిట్​ కార్డుతో అద్దె​ కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)