Breaking News

ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్

Published on Mon, 02/03/2025 - 20:23

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపు రూ. 50వేల నుంచి రూ. 1లక్షకు పెంచారు. ఇక త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను వెల్లడించనుంది.

ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని.. ద్రవ్య విధాన కమిటీ ఫిబ్రవరి 4 నుంచి కీలక చర్చలను నిర్వహించనుంది. మల్హోత్రా కీలక రేట్లలోని మార్పును ఫిబ్రవరి 7న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అందరి చూపు దీనిపైనే ఉంది. ఆ రోజు BPS రేటు తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గే అవకాశం ఉంది.

శక్తికాంత దాస్ పదవీ విరమణ తరువాత.. సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు. మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి ఎంపీసీ (Monetary Policy Committee) అవుతుంది. రేటు తగ్గింపు గురించి చాలా అంచనాలు ఉన్నప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ పెంచడానికి క్లిష్టమైన చర్యలు తీసుకుంటోంది.

ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ చర్చలు ఫిబ్రవరి 4 నుంచి 7 మధ్య జరగనున్నాయి. రెపో రేటుకు సంబంధించి అధికారిక ప్రకటన ఫిబ్రవరి 7 ఉదయం 10:00 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. గవర్నర్ మల్హోత్రా మధ్యాహ్నం 12:00 గంటలకు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత భారత ఆర్థిక స్థితి, కేంద్ర బడ్జెట్ 2025పై తన ఆలోచనల వెనుక గల కారణాల గురించి మాట్లాడతారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)