Breaking News

ఈఎంఐలపై ఫోన్‌ కొన్నవారికి షాక్‌! ఆర్బీఐ ఓకే అంటే మాత్రం..

Published on Thu, 09/11/2025 - 18:03

బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల నుంచి రుణంపై మొబైల్‌ ఫోన్‌లు తీసుకుని ఆ రుణాన్ని తిరిగి చెల్లించడంలో డీఫాల్ట్‌ అయితే అలాంటి ఫోన్‌లను వినియోగించేందుకు వీలు లేకుండా ఆ బ్యాంకులు లేదా రుణ సంస్థలు రీమోట్‌గా లాక్‌  చేయబోతున్నాయి. ఎందుకంటే వాటికి ఆర్బీఐ ఆ మేరకు అనుమతి ఇవ్వబోతోందంటూ రాయిటర్స్‌ కథనం పేర్కొంది.

వినియోగదారుల వాస్తవ ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు నిరర్థక రుణాలను తగ్గుంచుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఫోన్లతో సహా మూడింట ఒక వంతు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో చిన్న-టికెట్ వ్యక్తిగత రుణాలపై కొనుగోలు చేస్తున్నట్లు హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ 2024 అధ్యయనం చూపించింది.

గతేడాది కూడా బ్యాంకులు, రుణ సంస్థలు ఇలాగే రుణ గ్రహీతలు డీఫాల్ట్‌ అయితే రుణంపై కొనుగోలు చేసిన మొబైల్‌ ఫోన్‌లను లాక్‌ చేయడానికి ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)  అడ్డుకుంది. అయితే ఇప్పుడు ఇలాంటి నిరర్థక రుణాలు పెరిగిపోతుండటంతో రికవరీ పెంచుకోవడంలో భాగంగా కస్టమర్ల ఫోన్‌లను లాక్‌ చేసేందుకు ఆర్బీఐ రుణ సంస్థలకు అనుమతి ఇచ్చే ఆస్కారం ఉందని రాయిటర్స్‌ వివరించింది.

బ్యాంకులు, రుణసంస్థలతో సంప్రదింపులు జరిపిన తరువాత, ఫోన్-లాకింగ్ మెకానిజమ్‌పై మార్గదర్శకాలను ప్రవేశపెడుతూ  ఆర్బీఐ తన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌ను కొన్ని నెలల్లో అప్డేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఫోన్‌ లాకింగ్‌కు సంబంధించి రుణగ్రహీతల నుండి ముందస్తు సమ్మతిని తప్పనిసరి చేయడంతోపాటు లాక్ చేసిన ఫోన్లలో వ్యక్తిగత డేటాను రుణ సంస్థలు యాక్సెస్ చేయకుండా కూడా నిషేధించేలా ఈ నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు.

ఈ చర్య అమలైతే, బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి ప్రధాన కన్జూమర్‌ ఫైనాన్స్‌ సంస్థలకు రికవరీలు మెరుగవుతాయని భావిస్తున్నారు. క్రెడిట్ బ్యూరో సీఆర్‌ఐఎఫ్‌ హైమార్క్ ప్రకారం.. రూ.1 లక్ష లోపు  రుణాలే ఎక్కువగా డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది.  కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లలో 85% నాన్-బ్యాంక్ రుణ సంస్థల వద్దే ఉన్నాయి.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)