Breaking News

కస్టమర్‌కు అనుకూలంగా సేవలు ఉండాలి

Published on Fri, 06/09/2023 - 04:34

ముంబై: బ్యాంకులు కస్టమర్‌కు ప్రాధాన్యం ఇస్తూ, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌బీఐకి ప్యానెల్‌ సిఫారసు చేసింది. మరణించిన ఖాతాదారు వారసులు ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ చేసుకునేందుకు అనుమతించాలని, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్‌ తదితర సూచలను ప్యానెల్‌ చేసిన వాటిల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా  పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ను బ్యాంకుకు సంబంధించి ఏ శాఖలో అయినా, ఏ నెలలో అయినా సమర్పించేందుకు అనుమతించాలని, దీనివల్ల రద్దీని నివారించొచ్చని పేర్కొంది. ఆర్‌బీఐ నియంత్రణలోని సంస్థల పరిధిలో వినియోగదారు సేవా ప్రమాణాల సమీక్షపై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. గతేడాది మే నెలలో ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ బీపీ కనుంగో అద్యక్షతన ఈ కమిటీని నియమించడం గమనార్హం.

సూచనలు..
ఇంటి రుణాన్ని తీర్చివేసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తిరిగి రుణ గ్రహీతకు స్వాధీనం చేసే విషయంలో నిర్ధేశిత గడువు ఉండాలి. గడువులోగా ఇవ్వకపోతే బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీపై జరిమానా విధించాలి. డాక్యుమెంట్లు నష్టపోతే, వాటిని తిరిగి పొందే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు అయ్యే వ్యయాలను బ్యాంకులే పెట్టుకోవాలి. కస్టమర్లకు సంబంధించి రిస్క్‌ కేటగిరీలను సూచించింది. వేతన జీవులు అయితే వారికి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, వారిని హై రిస్క్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులను తక్కువ రిస్క్‌ వారిగా కేటాయించొచ్చని సూచించింది. కస్టమర్లతో వ్యవహారాలు నిర్వహించే సిబ్బంది, వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా నిర్ణీత కాలానికోసారి తప్పనిసరి శిక్షణ పొందాలని కూడా పేర్కొంది.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)