Breaking News

రేపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వరుసగా ఎనిమిదోసారి

Published on Fri, 06/07/2024 - 11:00

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 'శక్తికాంత దాస్' నేతృత్వంలోని 6 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ కీలక పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దీంతో రేపో రేటు ఎనిమిదోసారి కూడా 6.5 శాతం వద్ద యధాతధంగా ఉంచింది.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన వాస్తవ జీడీపీ వృద్ధిలో పెరుగుదలను ప్రకటించారు. ఇది 7 శాతం నుంచి 7.2 శాతానికి చేరింది. రేపో రేటు అనేది ఆర్‌బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.

రెపో రేటు
ఆర్‌బీఐ నుంచి ఇతర బ్యాంకులు (వాణిజ్య బ్యాంకులు) రుణాలు తీసుకుంటాయి. ఆ సమయంలో ఆర్‌బీఐ అలంటి బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. దీనినే రేపో రేటు అంటారు. ఈ రేపు రేటు దేశ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్థారిస్తారు. రేపో రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆర్‌బీఐ బ్యాంకుల నుంచి కూడా తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారి మీద ప్రభావం చూపిస్తుంది.

రివర్స్ రెపో రేటు
వాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బు ఉన్నపుడు ఆర్‌బీఐకు రుణాల రూపంలో ఇవ్వవచ్చు. అప్పుడు ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది. దీనిని రివర్స్ రెపో రేటు అంటారు. అయితే ఈ వడ్డీ రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. 2011కు ముందు రివర్స్ రేపో రేటును.. రేపో రేటుతో సంబంధం లేకుండా నిర్ణయించేవారు. ఆ తరువాత ఇందులో మార్పులు వచ్చాయి.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)