Breaking News

ప్రాజెక్ట్‌ రుణాలకు కొత్త నిబంధనలు 

Published on Fri, 06/20/2025 - 06:31

ముంబై: మౌలిక రంగ ప్రాజెక్టులు, మౌలికేతర ప్రాజెక్టులకు బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర నియంత్రిత సంస్థలు మంజూరు చేసే రుణాలకు సంబంధించి ఆర్‌బీఐ కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటి ప్రకారం ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాల ప్రారంభించే తేదీ (డీసీసీవో) విషయంలో వెసులుబాటు కల్పించింది. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు మూడేళ్లు, నాన్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రెండేళ్ల పాటు డీసీసీవో పొడిగింపు పరిమితికి అవకాశం ఇచ్చింది. కొత్త మార్గదర్శకాల అమలుకు ప్రాజెక్టులను స్థూలంగా.. డిజైన్, నిర్మాణం, కార్యకలాపాల దశలుగా వర్గీకరించారు.

 ‘‘నిర్మాణ దశలోని ప్రాజెక్టులకు బ్యాంక్‌లు లేదా ఎన్‌బీఎఫ్‌సీల రుణ వితరణ గరిష్టంగా రూ.1,500 కోట్లను మించకూడదు. విడిగా ఒక్కో రుణ దాత ఎక్స్‌పోజర్‌ ఇందులో 10 శాతానికి తక్కువ కాకుండా ఉండాలి. రూ1,500 కోట్లకు మించిన ప్రాజెక్టు రుణాల్లో ఒక్కో రుణదాత వారీ వాటా కనీసం 5 శాతం లేదా రూ.150 కోట్లు ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. రుణాన్ని ఖరారు చేయడానికి ముందే సంబంధిత ప్రాజెక్టుల నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు/ క్లియరెన్స్‌లు వచ్చినట్టు ధ్రువీకరించుకోవాలి. 

పర్యావరణ, చట్టబద్ధమైన, నియంత్రణ సంస్థల అనుమతులు ఇందులో భాగంగా ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది. రుణం మంజూరు చేసిన తర్వాత కూడా బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీ ప్రాజెక్టుల పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలి. సంబంధిత ప్రాజెక్టు సమస్యల్లో పడుతుందన్న సంకేతాలు కనిపిస్తే ముందస్తుగానే పరిష్కార ప్రణాళికకు చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 అక్టోబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.    వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు రుణాలకు సంబంధించి 1.25% ప్రొవిజన్‌ చేయాల్సి (పక్కన పెట్టడం) ఉంటుంది. 

వాణిజ్య–నివాస రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు ఇది ఒక శాతంగా ఉంటుంది. ఇతర ప్రాజెక్టుల రుణాలకు సైతం ఒక శాతం ప్రొవిజన్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులు కార్యకలాపాల దశలోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన కేటాయింపులు వరుసగా 1%, 0.75%, 0.40 శాతంగా ఉండనున్నాయి. నిజానికి గతంలో విడుదల చేసిన ముసాయిదా నిబంధనల్లో ప్రాజెక్టు రుణాలకు సంబంధించి.. నిర్మాణ దశలో ఉన్న వాటికి 5 శాతం, కార్యకలాపాలు మొదలు పెట్టిన తర్వాత ఒక శాతం కేటాయింపులు నిర్వహించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)