Breaking News

వృద్ధి గుడ్‌.. మరి వడ్డీ రేట్లో?

Published on Mon, 12/01/2025 - 05:28

మార్కెట్లు ఆల్‌టైమ్‌ రికార్డులకు అత్యంత చేరువలో ఉన్నాయి. గతంలో రెండుసార్లు మార్కెట్‌ ఈ స్థాయిలకు వచ్చి... అక్కడి నుంచి ముందుకు వెళ్లలేక కొంత కరెక్షన్‌కు గురయ్యింది. ఈ సారి మాత్రం మార్కెట్లు ముందుకెళ్ళి, కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందనేది నిపుణుల మాట. గత వారం చివర్లో... అది కూడా మార్కెట్లు ముగిశాక విడుదలైన క్యూ2 జీడీపీ వృద్ధి గణాంకాలు మార్కెట్‌ను ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నది వారి అభిప్రాయం. 

ఎందుకంటే వృద్ధి రేటు అంచనాలను మించింది. తయారీ, సర్వీసు రంగాలు 9 శాతం వృద్ధిని దాటి పరుగు తీయడంతో ఆరి్థక వ్యవస్థ 8.2 శాతం ఎగసింది. ఇది ఆరు త్రైమాసికాలలోనే అత్యధికం. కాబట్టి ఈ ప్రభావం సోమవారం మార్కెట్లలో ప్రతిఫలించనునున్న విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్‌ టారిఫ్‌ల నేపథ్యంలో జీఎస్‌టీ రేట్లను సవరించటమనేది దేశ ఆరి్థక వ్యవస్థ బలపడటానికి ఉపకరించినట్లు వారు అభిప్రాయపడుతున్నారు.  

దేశీ కీలకాంశాలివే... 
→ ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయబోయే దేశీయ అంశాల్లో ప్రధానమైనది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి విధానంపై జరిపే సమీక్షా సమావేశం. ఈ నెల 5న (వారాంతాన) ఈ సమావేశం ముగుస్తుంది. మరింతగా రేట్లను తగ్గించటమా... లేదా యథాతథ పరిస్థితిని కొనసాగించటమా అన్నది మార్కెట్లను ప్రభావితం చేయనుంది. వృద్ధి రేటు పెరిగింది కనక రేట్ల కోత ఉండొచ్చన్నదే ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తోంది. 

→ డిసెంబరు 1న (సోమవారం) అక్టోబర్‌ నెలకు సంబంధించిన దేశ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలవుతాయి. సెపె్టంబర్‌లో ఐఐపీ 4 శాతం వద్ద నిలకడగా నమోదైంది. తయారీ రంగం 4.8 శాతం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. 

→ నవంబర్‌ నెలకు ఆటో రంగ విక్రయ గణాంకాలు సైతం 1న వెలువడనున్నాయి. దీంతో పాటు హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సర్వీసులు, కాంపోజిట్‌ పీఎంఐ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. 

సాంకేతికంగా స్పీడ్‌.. 
→ గత వారం మొదట్లో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాయి. దీంతో సరికొత్త గరిష్టాలను తాకాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85707 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,203 పాయింట్ల వద్ద ముగిశాయి. సాంకేతికంగా చూస్తే ఈ వారం సైతం మార్కెట్లు మరింత పుంజుకునే వీలుంది. నిఫ్టీ 26,300 పాయింట్లను దాటితే.. 26,800– 26,850 వరకూ బలపడవచ్చు. ఇలాకాకుండా ఈ స్థాయిలో బలహీనపడితే.. తొలుత 26,000 పాయింట్లకు నీరసించవచ్చు. తదుపరి 25,850–25,800 పాయింట్ల స్థాయిలో సపోర్ట్‌ లభించే వీలుంది.  

గమనించాల్సిన ప్రధాన షేర్లు... 
అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్, భారత్‌ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌ లిమిటెడ్, గెయిల్‌ ఇండియా కంపెనీల షేర్లను గతవారం పలు బ్రోకరేజీ సంస్థలు రికమెండ్‌ చేశాయి. 
వీటి టార్గెట్‌ ధరను అప్‌గ్రేడ్‌ చేశాయి కూడా. దీంతో ఈ వారం ఇన్వెస్టర్లు ఈ షేర్లలో కదలికలను గమనించవచ్చు.  

 

Videos

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)