Breaking News

మరో ఐదు బ్యాంకులకు 'ఆర్‌బీఐ' జరిమానా!.. కారణం ఇదే..

Published on Sun, 07/07/2024 - 12:31

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో సహా మొత్తం ఐదు బ్యాంకులకు జరిమానా విధించింది. ఆర్‌బీఐ నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానాలు విధించడం జరిగిందని సమాచారం.

ఆర్‌బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కాకుండా.. గుజరాత్ రాజ్య కర్మచారి కోఆపరేటివ్ బ్యాంక్, రోహికా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (బిహార్), నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర), బ్యాంక్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ (పశ్చిమ బెంగాల్‌) ఉన్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్‌బీఐ ఏకంగా రూ. 1.31 కోట్ల జరిమానా విధించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్.. లోన్స్ అండ్ అడ్వాన్సులు వంటి వాటికి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలను ఉల్లంఘించిన కారణంగా 2024 జులై 4న రూ. 1,31,80,000 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లోని పలు నిబంధనలను పీఎన్‌బీ బ్యాంక్ ఉల్లంఘించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరికొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించడం జరిగింది. కాగా ఇప్పుడు భారీ జరిమానా చెల్లించాల్సిన  బ్యాంకుల జాబితాలో తాజాగా మరో ఐదు బ్యాంకులు చేరాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)