Breaking News

దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆర్‌బీఐ సమీక్ష

Published on Sat, 12/21/2024 - 08:30

గువహటి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గువహటిలో జరిగిన 612వ సెంట్రల్‌ బోర్డ్‌ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించింది. కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన మొదటి బోర్డ్‌ సమావేశమిది. సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌ ఆరేళ్లు అందించిన విశేష సేవలను బోర్డ్‌ ప్రశంసించింది.

ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?

‘ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితిని, అవుట్‌లుక్‌ను బోర్డ్‌ సమీక్షించింది. ఎంపిక చేసిన సెంట్రల్‌ బ్యాంక్‌ శాఖల కార్యకలాపాలతో పాటు దేశంలో ‘బ్యాంకింగ్‌ ధోరణి, పురోగతి–2023–24’పై ముసాయిదా నివేదికపై చర్చించింది’ అని ఆర్‌బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది. సెంట్రల్‌ బోర్డు ఇతర డైరెక్టర్లు సతీష్‌ కె మరాఠే, రేవతి అయ్యర్, సచిన్‌ చతుర్వేది, వేణు శ్రీనివాసన్, రవీంద్ర హెచ్‌ ధోలాకియాలు సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ గవర్నర్లు మైఖేల్‌ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్‌ రావు, టీ రబీ శంకర్, స్వామినాథన్‌ జే కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)