ఎన్ని అవమానాలు వచ్చినా.. రజిని.. కమల్ కానిది విజయ్ సాధించాడు
Breaking News
చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ ఊరట
Published on Mon, 05/04/2026 - 21:19
డిపాజిట్లు సేకరించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు (బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు) రిజిస్ట్రేషన్, రిజర్వ్ ఫండ్ నిబంధనల నుంచి మినహాయింపునిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రూ. 1,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్ ఉన్నవి, ప్రజా ధనాన్ని తీసుకోని ఎన్బీఎఫ్సీలు ఈ జాబితాలో ఉంటాయి.
ప్రస్తుతం టైప్ 1 ఎన్‌బీఎఫ్‌సీలుగా నమోదు చేసుకున్న సంస్థలు, మినహాయింపు పొందడానికి 2026 డిసెంబర్ 31 వరకు డీరిజిస్ట్రేషన్ కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 45ఐఏ ప్రకారం ఎన్బీఎఫ్సీలు చట్టప్రకారం రిజి్రస్టేషన్ చేసుకోవాల్సి ఉంటోంది. అలాగే రిజర్వ్ ఫండ్‌ని ఏర్పాటు చేసి, తమ నికర లాభాల్లో 20 శాతం మొత్తాన్ని ప్రతి సంవత్సరం దానికి బదలాయించాల్సి ఉంటోంది.
Tags : 1