ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆర్‌బీఐ గవర్నర్‌

Published on Tue, 11/26/2024 - 09:39

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్ ఛాతీ నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఈరోజు ఉదయం దాస్‌కు ఛాతీ నొప్పి రావడంతో పరిస్థితి విషమించి ఆసుప్రతిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైద్యులు తన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి.

‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అసిడిటీ ద్వారా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం దాస్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరో 2-3 గంటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని ఆర్‌బీఐ ప్రతినిధి తెలిపారు.

ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..

శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్‌గా 2018లో నియమితులయ్యారు. ఆయన అంతకుముందు పదిహేనో ఆర్థిక సంఘం సభ్యుడిగా పని చేశారు. దాస్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి. ఆయన కేంద్ర ప్రభుత్వ, తమిళనాడు ప్రభుత్వాలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు. రెవెన్యూ కార్యదర్శిగా, ఫెర్టిలైజర్స్‌ సెక్రటరీగా వివిధ కేంద్ర ప్రభుత్వ హోదాల్లో పనిచేశారు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ఎన్‌డీబీ, ఏఐఐబీలలో ప్రత్యామ్నాయ గవర్నర్‌గా కూడా పనిచేశారు. భారత్ తరఫున ఐఎంఎప్‌, జీ20, బ్రిక్స్‌, సార్క్‌ మొదలైన అనేక అంతర్జాతీయ ఫోరమ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)