Breaking News

డిపాజిటర్ల సొమ్ము: ఆర్‌బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

Published on Tue, 09/26/2023 - 12:16

డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకుల ప్రధానవిధి అని  రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌  శక్తికాంత దాస్‌ అన్నారు.  బ్యాంకులో వారి సొమ్మను  కాపాడటం అనేది అది పవిత్రమైన విధి,  మన కిష్ట దైవాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని ఆర్‌బిఐ గవర్నర్ వెల్లడించారు.  మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి డిపాజిట్లపై ఆధారపడినందున ఇది చాలా  ముఖ్యమైందని పేర్కొన్నారు.

అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల (యుసిబి) డైరెక్టర్లను ఉద్దేశించి  ప్రసంగించిన శక్తి కాంత దాస్‌  బ్యాంకుల  బాధ్యతను  గుర్తు చేశారు.  అయితే ఆగస్టు 30న గవర్నర్ ప్రసంగం చేయగా, ఆ వీడియోను ఆర్‌బీఐ సోమవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. 


డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ  బ్యాంకు  అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి , మసీదు,  గురుద్వారా మరే ఇతర మతపరమైన పవిత్ర ప్రదేశానికి వెళ్లి నమస్కరించడం లాంటివాటి కంటే కూడా పవిత్రమైందని తాను నమ్ముతానని చెప్పారు. అఆగే డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందా అనేది  పర్యవేక్షిస్తూ, బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యతఅని, దీనికి సంబంధించి ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలని, ఈ రంగంలో యూసీబీలు ముఖ్యమైన భాగమని కూడా ఆయన గుర్తు చేశారు. ముఖం‍్యంగా  సహకార బ్యాంకింగ్ స్థలంలో, ఎంటిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లు,  డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు ఎ క్కువవుతున్న తరుణంలో  గవర్నర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)