యూపీఐ, రూపే ‘విశ్వవ్యాప్త’మే ధ్యేయం

Published on Thu, 08/29/2024 - 05:41

ముంబై: యూపీఐ, రూపేలను ‘‘వాస్తవరీతిన విశ్వ వ్యాపితం’’గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం స్పష్టం చేశారు. సెంట్రల్‌ బ్యాంక్‌ దృష్టి సారిస్తున్న కీలక అంశాల్లో ఇది ఒకటని  పేర్కొన్నారు. 

గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2024లో గవర్నర్‌ మాట్లాడుతూ, ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోనికి తీసుకురావడం,  డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) పురోగతికి,  వినియోగదారుల రక్షణ, సైబర్‌ భద్రత, స్థిరమైన ఫైనాన్స్, ఆర్థిక సేవల ప్రపంచ ఏకీకరణ అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 

అనేక దేశాలతో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అంతర్జాతీయ వేదికల ఏర్పాటు, ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవడంలో భారత్‌ నిమగ్నమై ఉందని అన్నారు.  డేటా గోప్యత ఆందోళన  తదితర  అంశాలను పరిగణనలోకి తీసుకుని ‘విశ్వసనీయ ఏఐ‘ అభివృద్ధికి  ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు, అలాగే ఆర్థిక రంగ సంస్థలు పరస్పరం సహకరించుకోవాలని కూడా ఈ సందర్భంగా దాస్‌ ఉద్ఘాటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

→ సరిహద్దు చెల్లింపు వ్యవస్థలతో సహా ఆర్థిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఆర్‌బీఐ కీలక లక్ష్యాలుగా ఉన్నాయి.  
→ భారతదేశానికి సాంకేతిక ప్రతిభ,  అభివృద్ధి చెందిన ఆర్థిక ఫిన్‌టెక్‌ వ్యవస్థల బలం ఉంది. తద్వారా డిజిటల్‌ ఆవిష్కరణలు, ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లు,  అంతర్జాతీయ సహకారానికి నిబద్దతతో పనిచేయడం,  ఎక్సలెన్స్‌ సంస్థలను అభివృద్ధి చేయడం వంటి వాటికి  గ్లోబల్‌ హబ్‌గా ఉండే సామర్థ్యాన్ని దేశం సముపార్జించింది.  
→ భూటాన్, నేపాల్, శ్రీలంక, సింగపూర్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ), మారిషస్, నమీబియా, పెరూ, ఫ్రాన్స్‌సహా కొన్ని ఇతర దేశాలతో రుపే కార్డ్‌ల అంగీకారం, యూపీఐ నెట్‌వర్క్‌ ద్వారా చెల్లింపుల్లో గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది. 

డిజిటల్‌ ట్రాన్స్‌ బోర్డర్‌ చెల్లింపులతో అక్రమాలకు చెక్‌ 
– ఫెడ్‌ అధికారి క్రిస్టోఫర్‌ జే వాలర్‌ 
ఫెడరల్‌ రిజర్వ్‌ సిస్టమ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యుడు క్రిస్టోఫర్‌ జే వాలెర్‌ ఇదే కార్యక్రమంలో  మాట్లాడుతూ, డిజిటల్‌ క్రాస్‌ బోర్డర్‌ చెల్లింపులతో అక్రమ ధనార్జన, టెర్రర్‌ ఫండింగ్‌ కట్టడి సాధ్యమవుతాయని అన్నారు. ట్రాన్స్‌–బోర్డర్‌ డిజిటల్‌ లావాదేవీల సామర్థ్యం పెంపు ఆవశ్యకతను ఆర్‌బీఐ గవర్నర్‌ ఉద్ఘాటిస్తున్న నేపథ్యంలో ఫెడ్‌ అధికారి కూడా దీనికి వోటువేయడం గమనార్హం.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)