Breaking News

ఆర్‌బీఐ అంచనాలకు డేటా ఆధారిత విధానం

Published on Sat, 01/11/2025 - 09:41

ద్రవ్యోల్బణం, వృద్ధిని అంచనా వేసే సాధనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సమగ్ర సమీక్షను ప్రారంభించారు. గత నెలలో బాధ్యతలు స్వీకరించిన మల్హోత్రా కొత్త డేటా పాయింట్లు, విశ్లేషణలు, అంచనా ప్రక్రియలను చేర్చడం ద్వారా ఆర్‌బీఐ నివేదికలను మరింత స్పష్టతతో ముందుంచాలని నిర్దేశించారు. సమీక్షలో భాగంగా మల్హోత్రా(Sanjay Malhotra) అనుసరిస్తున్న కొన్ని విధానాల గురించి తెలుసుకుందాం.

డేటాసెట్లను చేర్చడం..

ఆర్‌బీఐ నివేదికలను మరింత లోతుగా అంచనా వేయడానికి ఉపయోగించే డేటాసెట్లను విస్తరించడంపై మల్హోత్రా దృష్టి సారించారు. ఇందులో స్మాల్‌ టికెట్ డిజిటల్ చెల్లింపులు, ఫుడ్ డెలివరీ యాప్‌ల డేటా, ఆన్‌లైన్‌ ట్యాక్సీ అగ్రిగేటర్ల నుంచి డేటా సేకరించడం వంటి అంశాలున్నాయి. ఈ కొత్త డేటా పాయింట్లు ఆదాయం, వ్యయ ధోరణుల స్పష్టమైన వైఖరిని తెలియజేస్తాయని నమ్ముతున్నారు.

మెషిన్ లెర్నింగ్ టూల్స్

ద్రవ్యోల్బణ అంచనాలను మెరుగుపరచడానికి, ఆహారం వంటి అస్థిర వస్తువులలో ధరల హెచ్చుతగ్గులను ముందుగానే అంచనా వేయడానికి ఆర్‌బీఐ మెషిన్ లెర్నింగ్ సాధనాలను ఉపయోగిస్తుంది. ఈ విధానం ద్రవ్యోల్బణ(inflation) అంచనాలను మరింత ఖచ్చితత్వంతో తెలియజేస్తుంది.

మరింత సమాచార సేకరణ

భారతదేశ అనధికారిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరింత సమగ్ర డేటాను సేకరించడానికి ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. అసంఘటిత రంగాల నుంచి సమకూరే ఆదాయంపై ఖచ్చితమైన డేటా పాయింట్లు లేవు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అందుకోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అధికారిక డేటా వనరుల నుంచి సంగ్రహించబడని ఆర్థిక కార్యకలాపాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు జరగాలి.

ఇదీ చదవండి: కొన్నేళ్లలోనే రూ.8.6 లక్షల కోట్లకు చేరే ఎగుమతులు

సవాళ్లు.. అంచనాలు

ప్రస్తుత అంచనా లోపాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు దేశ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనా(growth forecasting)లపై ఆర్‌బీఐ అంచనాలు విడుదల చేసింది. ఉదాహరణకు, ఆర్‌బీఐ దేశ ఆర్థిక వృద్ధి అంచనాను 2024-25 సంవత్సరానికి 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించాల్సి వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను  మాత్రం 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది. రెండు డేటా పాయింట్లు విభిన్నంగా ఉండడం కొంత చర్చకు దారి తీసింది.

కొత్త మార్పుల ప్రభావం: కొత్తగా తీసుకురాబోయే మార్పులు, డేటాసెట్ల చేర్పులు ఆర్థిక వృద్ధికి సంబంధించి ఖచ్చితమైన అంచనాలకు హామీ ఇవ్వనప్పటికీ, గతంలో కంటే మెరుగైన ఫలితాలు తెలుసుకునేందుకు దోహదం చేస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ మార్పుల ప్రభావం ఫిబ్రవరి పాలసీ అంచనాల్లో కనిపిస్తుందని భావిస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)