Breaking News

ఆర్‌బీఐ పసిడి నిల్వలు 880 టన్నులు! 

Published on Thu, 10/23/2025 - 01:00

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల కాలంలో 600 కిలోల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. దీంతో సెప్టెంబర్‌ చివరికి ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 880.18 మెట్రిక్‌ టన్నులకు పెరిగాయి. వీటి విలువ 95 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8.36 లక్షల కోట్లు)గా ఉంటుందని ఆర్‌బీఐ డేటా తెలియజేస్తోంది. 

ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 200 కిలోలు, జూలై–సెప్టెంబర్‌ కాలంలో మరో 400 కిలోల చొప్పున బంగారం నిల్వలను ఆర్‌బీఐ పెంచుకుంది. అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళికపరమైన తీవ్ర అనిశ్చితులు నెలకొన్న తరుణంలో, డాలర్‌ రిస్క్ ను తగ్గించుకునేందుకు  ఆర్‌బీఐ ఇటీవలి సంవత్సరాల్లో తన విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుతోంది. 2025 మార్చి చివరికి ఆర్‌బీఐ వద్ద 879.58 మెట్రికల్‌ టన్నుల పసిడి నిల్వలు ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆర్‌బీఐ 54.13 మెట్రిక్‌ టన్నుల మేర బంగారం కొనుగోలు చేసింది. ఇటీవలి కాలంలో ఆర్‌బీఐ పసిడికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ డేటా స్పష్టం చేస్తోంది.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)