Breaking News

అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ విస్తరణ

Published on Wed, 10/08/2025 - 09:16

రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) పరిధిలోకి రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు చేరనున్నాయి. ఇందుకు 2021 ఏకీకృత అంబుడ్స్‌మన్‌ పథకం(ఐవోఎస్‌)లోకి వీటిని చేరుస్తూ ఆర్‌బీఐ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో నవంబర్‌ 1నుంచి రూ.50 కోట్ల డిపాజిట్‌ పరిమాణంగల అన్ని వాణిజ్య బ్యాంకులతోపాటు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు, షెడ్యూల్డ్‌ ప్రైమరీ(అర్బన్‌) సహకార బ్యాంకులు, నాన్‌షెడ్యూల్డ్‌ ప్రైమరీ(అర్బన్‌) సహకార బ్యాంకులకు ఏకీకృత అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ వర్తించనుంది.

కనీసం రూ. 100 కోట్లు అంతకుమించిన ఆస్తులు కలిగిన అన్ని నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లనూ పథకం కవర్‌ చేయనుంది. అయితే హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను ఈ పథకం నుంచి మినహాయింపునివ్వగా.. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలను చేర్చింది. ఈ ఆర్‌బీఐ ఐవోఎస్‌ను 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టింది.  అంబుడ్స్‌మన్‌ అనేది బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర నియంత్రిత సంస్థల వినియోగదారుల కోసం కేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. 

క్రెడిట్‌ రిస్క్‌లో సవరణ

బ్యాంకుల క్రెడిట్‌ రిస్క్‌ నిబంధనలను సవరించేందుకు ఆర్‌బీఐ తాజాగా ప్రతిపాదించింది. సంభవించిన నష్టాల ఆధారంగా ప్రొవిజనింగ్‌ చేపట్టేందుకు ప్రస్తుతం బ్యాంకులను ఆర్‌బీఐ నిబంధనలు అనుమతిస్తున్నాయి. వీటిస్థానే అంచనా రుణ నష్టాల ఆధారిత ప్రొవిజనింగ్‌కు వీలు కల్పించే విధంగా ఆర్‌బీఐ నిబంధనల సవరణకు ప్రతిపాదించింది. తద్వారా క్రెడిట్‌ రిస్క్‌ నిర్వహణా విధానాలను మరింత పటిష్టం చేయనుంది. అంతేకాకుండా వివిధ ఫైనాన్షియల్‌ సంస్థలను పోల్చి చూడటంలో మరిన్ని అవకాశాలకు తెరతీయనుంది. 

2025 ఆర్‌బీఐ మార్గదర్శకాలు పేరుతో అంతర్జాతీయంగా అనుమతించిన నిబంధనలు, అకౌంటింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా తాజా ముసాయిదాను రూపొందించింది. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, దేశవ్యాప్త ఫైనాన్షియల్‌ సంస్థలు– అసెట్‌ క్లాసిఫికేషన్, ప్రొవిజనింగ్‌ అండ్‌ ఇన్‌కమ్‌ రికగ్నిషన్‌ పేరుతో ముసాయిదాను విడుదల చేసింది.

ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ!

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)