Breaking News

గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలు

Published on Thu, 02/06/2025 - 09:03

రుణాలపై విధించే వడ్డీరేట్లలో పారదర్శకతను పెంపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. విభిన్న రుణాలపై వసూలు చేసే గరిష్ట వడ్డీ రేట్లను బహిర్గతం చేయాలని బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (NBFC) ఆదేశించింది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, బీమా, ఇతర ఛార్జీలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.

ఆర్‌బీఐ ఆదేశాల్లోని కీలక అంశాలు

తనఖా, వాహనం, ఆస్తి, బంగారం, విద్యా రుణాలు వంటి వివిధ రుణ కేటగిరీలకు కాంపోజిట్ సీలింగ్ రేట్ల(గరిష్ట వడ్డీరేట్లు)ను ఎన్‌బీఎప్‌సీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ గరిష్ట రేట్లను సంబంధిత డైరెక్టర్ల బోర్డులు ఆమోదించాలి. ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఆర్‌బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌కు అనుగుణంగా ఉండాలి. ఇది వివిధ కేటగిరీల రుణగ్రహీతలకు వేర్వేరు రేట్లను వసూలు చేసే విధానాలపై స్పష్టతను ఇస్తుంది. రుణ రేట్లపై ఆర్‌బీఐ పరిమితులు విధించనప్పటికీ, బోర్డు ఆమోదం లేకుండా ఎన్‌బీఎఫ్‌సీలు వెల్లడించిన గరిష్ట రేట్లను మించరాదు.

ఇదీ చదవండి: కోటక్‌ బ్యాంకు అలెర్ట్‌.. ‘డెబిట్ కార్డులు పని చేయవు’

పెరుగుతున్న గృహ రుణభారం, రుణగ్రహీతలకు వారి రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. దీనిపై కొంత ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. ఆర్‌బీఐ నేరుగా రుణ రేట్లను నియంత్రించనప్పటికీ ఎన్‌బీఎఫ్‌సీలు తమ రుణ ధరల్లో పారదర్శకతను కొనసాగించడానికి ఈ ఆదేశాలు ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది సంస్థలపై కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

#

Tags : 1

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు