Breaking News

మనీ మార్కెట్లకు సెలవులో మార్పు: రిజర్వ్‌ బ్యాంక్‌

Published on Fri, 09/05/2025 - 17:36

ముంబై: మనీ మార్కెట్లకు ఈ నెల 8న సెలవు వర్తించనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇంతక్రితం ప్రకటించిన సెలవు తేదీ 5ను తాజాగా 8కు మార్చడంతో ప్రభుత్వ సెక్యూరిటీ(జీసెక్‌)లు, విదేశీ మారకం, రుపీ ఇంటరెస్ట్‌ రేటు డెరివేటివ్స్‌లో లావాదేవీలు, సెటిల్‌మెంట్స్‌ ఉండబోవని స్పష్టం చేసింది. వెరసి ఈ నెల 5న జీసెక్‌లు, విదేశీ మారకం, మనీ మార్కెట్, రుపీ ఇంటరెస్ట్‌ రేటు డెరివేటివ్స్‌ మార్కె ట్లు యథావిధిగా పనిచేస్తాయని తెలియజేసింది.  

ఇంకొంత వివరంగా చెప్పాలంటే ఈ సెలవు మార్పు వెనుక ఉన్న కారణం మహారాష్ట్ర ప్రభుత్వం  తీసుకున్న తాత్కాలిక నిర్ణయం. ముంబై నగరంలో సెప్టెంబర్‌ 6న జరగనున్న అనంత చతుర్దశి  సందర్భంగా గణేశ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. అదే సమయంలో ఈద్-ఎ-మిలాద్ కూడా జరగనుండటంతో, రెండు పెద్ద ఉత్సవాలు ఒకే రోజు జరగడం వల్ల లాజిస్టికల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో, మత సామరస్యత, సౌకర్యవంతమైన నిర్వహణ కోసం ఈద్-ఎ-మిలాద్ సెలవును సెప్టెంబర్‌ 8కి మార్చినట్లు ప్రభుత్వం తెలిపింది.   ఈ మార్పు ప్రభావం  ముంబై నగరం, పరిసర జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం సెప్టెంబర్‌ 5న సెలవు యథావిధిగా అమలులో ఉంటుంది.  

#

Tags : 1

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)