Breaking News

ఇక చకచకా చెక్కుల క్లియరెన్స్‌ 

Published on Thu, 08/14/2025 - 04:35

ముంబై: చెక్కులను వేగంగా క్లియర్‌ (చెల్లింపులు) చేసే దిశగా ఆర్‌బీఐ అక్టోబర్‌ 4 నుంచి కొత్త యంత్రాంగాన్ని అమల్లోకి తీసుకురానుంది. బ్యాంక్‌లో చెక్కు సమర్పించిన గంటల్లోనే అది నగదుగా మారిపోనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్కు ట్రంకేషన్‌ సిస్టమ్‌ (సీటీఎస్‌) కింద రెండు పనిదినాల వరకు సమయం తీసుకుంటోంది. కొత్త విధానంలో చెక్కులను స్కాన్‌ చేసి వాటిని వెంటనే క్లియరింగ్‌ హౌస్‌కు బ్యాంక్‌లు పంపాల్సి ఉంటుంది. దీంతో క్లియరింగ్‌ సైకిల్‌ టీప్లస్‌1 (సమర్పించిన తర్వాతి రోజు) నుంచి కొన్ని గంటలకు తగ్గిపోనుంది.

సీటీఎస్‌లో బ్యాచ్‌ ప్రాసెసింగ్‌ నుంచి కంటిన్యూయెస్‌ క్లియరింగ్‌ విత్‌ ‘ఆన్‌ రియలైజేషన్‌ సెటిల్‌మెంట్‌’కు బ్యాంక్‌లు మారిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంక్‌లకు ఆర్‌బీఐ సర్క్యులర్‌ జారీ చేసింది. ‘‘సీటీఎస్‌ నుంచి కంటిన్యూయెస్‌ క్లియరింగ్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ ఆన్‌ రియలైజేషన్‌కు రెండు దశల్లో మారిపోవాలని నిర్ణయించడమైంది. మొదటి దశ అక్టోబర్‌ 4 నుంచి, రెండో దశ 2026 జనవరి 3 నుంచి అమల్లోకి వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకటే సెషన్‌ (చెక్కుల సమర్పణ) ఉంటుంది’ అని ఆర్‌బీఐ పేర్కొంది.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)