Breaking News

పండగైనా బ్యాంకులు పనిచేయాల్సిందే: ఆర్‌బీఐ

Published on Thu, 02/13/2025 - 21:11

మార్చి 31, 2025 (సోమవారం) ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ.. అన్ని బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు కాబట్టి.. అన్ని లావాదేవాలను అదే రోజు నమోదయ్యేలా చూసేందుకు సెలవు రద్దు చేయడం జరిగింది.

2025 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కాబట్టి అప్పటికే పన్ను చెల్లింపులు (ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు), పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వ జీతభత్యాల చెల్లింపు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజా లావాదేవీలను ముగించాల్సి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

నిజానికి మార్చి 31 రంజాన్ పండుగ, ఈ కారణంగానే.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు బ్యాంకులన్నీ పనిచేయాలని.. ఆర్ధిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలనీ ఆర్‌బీఐ ఆదేశించింది. అంతే కాకుండా ఏప్రిల్ 1న సెలవు దినంగా ప్రకటించింది. ఆన్‌లైన్ సేవలు అన్ని సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
 

#

Tags : 1

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)