Breaking News

కనీసం ఇద్దరు.. ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం 

Published on Thu, 10/26/2023 - 09:20

ముంబై: బోర్డులో ఎండీ, సీఈవోతోపాటు ఇద్దరు హోల్‌టైమ్‌ డైరెక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల సబ్సిడరీలను ఆర్‌బీఐ కోరింది. వారసత్వ బదిలీకి వీలుగా ఈ సూచన చేసింది. బ్యాంకింగ్‌ రంగంలో పెరుగుతున్న సంక్లిష్టతల నేపథ్యంలో ప్రస్తుత, భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సమర్థవంతమైన సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ బృందం అవసరమని గుర్తు చేసింది.

‘‘ఇలాంటి సమర్థవంతమైన బృందాన్ని ఏర్పాటు చేయడం వల్ల నాయకత్వ బదిలీకి కూడా సాయపడుతుంది. ఎండీ, సీఈవోలకు సంబంధించి గరిష్ట వయసు నిబంధనల అమలుకు వీలు కల్పిస్తుంది’’అని ఆర్‌బీఐ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. 

కార్యకలాపాల స్థాయి, వ్యాపారం, సంక్లిష్టతలు, ఇతర అంశాల ఆధారంగా బోర్డులో గరిష్టంగా ఎంత మంది హోల్‌టైమ్‌ డైరెక్టర్లు ఉండాలనే అంశాన్ని బ్యాంక్‌ల బోర్డులు నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. హోల్‌టైమ్‌ డైరెక్టర్లకు సంబంధించి ప్రస్తుత బ్యాంక్‌ బోర్డులు కనీస అవసరాలకు అనుగుణంగా లేవంటూ.. ఇక్కడి నుంచి నాలుగు నెలల్లోగా హోల్‌టైమ్‌ డైరెక్టర్ల నియామకం విషయమై ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)