Breaking News

బ్యాంక్‌లపైనే ఆధారపడొద్దు

Published on Thu, 12/28/2023 - 05:19

ముంబై: నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలని, బ్యాంక్‌లపై ఆధారపడడాన్ని పరిమితం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలకు) ఆర్‌బీఐ సూచించింది. బలమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విధానాల ద్వారా బ్యాలన్స్‌ షీట్లు పటిష్టం చేసుకుని, మోసాలు, డేటా చోరీల నుంచి రక్షణ కలి్పంచుకోవాలని కోరింది.

దేశ బ్యాంకింగ్‌ రంగం, ఎన్‌బీఎఫ్‌సీలు బలంగా ఉన్నాయంటూ.. అధిక నగదు నిష్పత్తి, మెరుగుపడిన ఆస్తుల నాణ్యత, లాభాల్లో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. ఈ మేరకు బ్యాంకింగ్‌ రంగంపై ఆర్‌బీఐ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య పరస్పర అనుసంధానత పెరిగిన నేపథ్యంలో.. ఎన్‌బీఎఫ్‌సీలు తమ నిధుల సమీకరణ మార్గాలను విస్తృతం చేసుకోవాలి. బ్యాంక్‌లపై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. కస్టమర్లకు సేవల విషయంలో మరింత కృషి చేయాలి’’అని ఆర్‌బీఐ కోరింది.  

సైబర్‌ దాడుల రిస్క్‌
నూతన టెక్నాలజీల అమలు నేపథ్యంలో సైబర్‌ దాడులు, డేటా చోరీ, నిర్వహణ వైఫల్యాలు పెరిగినట్టు పేర్కొంది. మెరుగైన పాలన, రిస్క్‌ నిర్వహణ విధానాల ద్వారా బ్యాలన్స్‌ షీట్లను పటిష్టం చేసుకుని, పెరుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలను చేరుకునే విధంగా ఉండాలని కోరింది. ‘‘ఈ విధమైన సాంకేతిక, సైబర్‌ భద్రతా రిస్క్‌లను గుర్తించి, వాటి ముప్పును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. బలమైన గవర్నెన్స్, రిస్క్‌ నిర్వహణ విధానాల ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టం
చేసుకోవాలి’’అని సూచించింది.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)