Breaking News

వీసాపై ఆర్‌బీఐ ఆంక్షలు!

Published on Fri, 02/16/2024 - 06:28

ముంబై: కార్డు చెల్లింపులను స్వీకరించని సంస్థలకు మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరపడాన్ని నిలిపివేయాలంటూ కార్డు నెట్‌వర్క్‌ సంస్థ వీసాను ఆర్‌బీఐ ఆదేశించినట్లు సమాచారం. ఇలాంటి లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు చట్టవిరుద్ధంగా బదిలీ అవుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది.

‘కార్డు ద్వారా చెల్లింపులను స్వీకరించని సంస్థలకు నిర్ధిష్ట మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరిగేలా ఒక కార్డ్‌ నెట్‌వర్క్‌ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది‘ అంటూ వీసా పేరును ప్రస్తావించకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ వ్యవహారంపై చేపట్టిన అధ్యయనం పూర్తయ్యే వరకు అటువంటి ఒప్పందాలను నిలిపివేయాలని కార్డు కంపెనీకి సూచించినట్లు వివరించింది. అయితే, క్రెడిట్‌ కార్డుల సాధారణ వినియోగంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. ఆర్‌బీఐ ప్రత్యేకంగా పేరు ప్రస్తావించనప్పటికీ సదరు కార్డు నెట్‌వర్క్‌ సంస్థ వీసానే అని సంబంధిత వర్గాలు తెలిపాయి.  నిబంధనల ప్రకారం ఇది కూడా ఒక తరహా చెల్లింపు విధానం కిందకే వస్తుందని, అధికారికంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది.

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి