Breaking News

యస్‌ బ్యాంక్‌లో మార్పులకు ఆర్‌బీఐ ఓకే..

Published on Thu, 09/11/2025 - 12:59

బోర్డులో నామినీ డైరెక్టర్ల నియామకానికి తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఇందుకు ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌(ఏవోఏ)లో ప్రతిపాదిత సవరణలకు అనుమతించినట్లు పేర్కొంది. దీంతో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌ఎంబీసీ) ఇద్దరు నామినీ డైరెక్టర్లను నామినేట్‌ చేసేందుకు వీలు చిక్కనుంది. మరో నామినీ డైరెక్టర్‌ను పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) ఎంపిక చేయనుంది.

యస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐసహా ఏడు ఇతర బ్యాంకులకు గల వాటాలను జపనీస్‌ దిగ్గజం ఎస్‌ఎంబీసీ సొంతం చేసుకున్నాక బోర్డులో నియామకాలకు తెరలేవనుంది. కాగా.. సెకండరీ కొనుగోళ్ల ద్వారా బ్యాంకులో 20 శాతం వాటాను ఎస్‌ఎంబీసీ చేజిక్కించుకోనున్నట్లు మే 9న యస్‌ బ్యాంక్‌ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా ఎస్‌బీఐ నుంచి 13.19 శాతం వాటాను కొనుగోలు చేయనుండగా.. యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, కొటక్‌ మహీంద్రా బ్యాంకుల నుంచి మిగిలిన 6.81 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది.

ఈ నెల మొదట్లో ప్రతిపాదిత డీల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆర్‌బీఐ సైతం ఇందుకు అనుమతిస్తూ ఎస్‌ఎంబీసీ ప్రమోటర్‌గా గుర్తింపు పొంబోదని తెలియజేసింది. ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐకు 24 శాతం వాటా ఉంది. తాజా డీల్‌ తదుపరి 10.81 శాతానికి వాటా పరిమితంకానుంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)