Breaking News

ఆర్థిక మోసాలకు చెక్‌ పెట్టేలా పరిష్కారాలు

Published on Wed, 01/08/2025 - 12:07

ఆర్థిక సేవల్లో మరింత భద్రతను పెంచడం, దివ్యాంగులు సులువుగా ఆర్థిక లావాదేవీలను వినియోగించేలా విభిన్న పరిష్కారాలు అందించిన కంపెనీలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(RBI) మూడో హ్యాకథాన్‌ విజేతలుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాకథాన్‌(Hackathon)లో పాల్గొనేందుకు మొత్తం 534 ప్రతిపాదనలు వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది.

‘జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్’, ‘బీయింగ్ దివ్యాంగ్‌ ఫ్రెండ్లీ’ థీమ్‌లతో గ్లోబల్ హ్యాకథాన్ మూడో ఎడిషన్‌ను ఆర్‌బీఐ ఇటీవల నిర్వహించింది. ఈ హ్యాక్‌థాన్‌కు వచ్చిన మొత్తం ప్రతిపాదనల్లో యునైటెడ్ స్టేట్స్(USA), యూకే, హాంకాంగ్, సింగపూర్, బ్రెజిల్, మొరాకోతో సహా దేశంలోని చాలా కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయి. వీటిలో 28 సంస్థలను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. వాటిని ఫైనల్‌ లిస్ట్‌ కోసం స్వతంత్ర జ్యూరీకి పంపించినట్లు పేర్కొంది. అందులో కింది కంపెనీలను విజేతలుగా నిలిచినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

  • ఎఫ్‌పీఎల్‌ టెక్నాలజీస్

  • క్సాల్స్ టెక్నాలజీస్

  • ఎపిఫై టెక్నాలజీస్

  • న్యాప్‌​ఐటీ సైబర్‌సెక్‌

  • హెచ్‌విజన్‌ ఇండియా

  • రూప్య దర్శిని

  • విస్‌ఆస్ట్‌

ఇదీ చదవండి: రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఆర్థిక మోసాలను కట్టడి చేయడంతోపాటు, దివ్యాంగులు సులభంగా వీటిని వినియోగించేలా ఈ కంపెనీలు పరిష్కారాలు అందించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత నిబంధనలకు లోబడి ఈ కంపెనీల టెక్నాలజీలు పటిష్ఠ భద్రతతో, సులువుగా ఆర్థిక సేవలను అందుబాటులో ఉంచేందుకు దోహదం చేస్తాయని తెలిపింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)