Breaking News

ఏప్రిల్ 2026 నుంచి ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’తో తగ్గుదల!

Published on Fri, 02/20/2026 - 12:46

భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్కరణలు చేపడుతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ కోసం ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్ పాటించే బ్యాంకులకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా ఖాతాదారుల డిపాజిట్లకు మరింత భద్రత చేకూరనుంది.

ప్రస్తుత విధానం vs కొత్త విధానం

ప్రస్తుతం అమలులో ఉన్న ఫ్లాట్ ప్రీమియం పద్ధతిలో బ్యాంకు స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి రూ.100 అసెసబుల్ డిపాజిట్లకు (ఒక బ్యాంకు తన వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏ మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రీమియంను లెక్కిస్తారో దాన్ని అసెసబుల్ డిపాజిట్లు అంటారు) 12 పైసలను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 6, 2026న విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ ధరలను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నిర్ణయించే రిస్క్ స్కోర్ల ఆధారంగా వర్గీకరిస్తారు.

ముఖ్యమైన అంశాలు

  • బ్యాంకుల అంతర్గత రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ప్రీమియం మారుతుంది. పటిష్టమైన ఆర్థిక స్థితి ఉన్న బ్యాంకులు తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

  • ఐసీఆర్ఏ అంచనా ప్రకారం క్లెయిమ్‌లు లేని, సుదీర్ఘ హిస్టరీ కలిగిన బ్యాంకులు తమ అసెట్స్ పై రిటర్న్ (ఆర్‌ఓఏ)లో దాదాపు 4 బేసిస్ పాయింట్ల వృద్ధిని చూడవచ్చు.

  • దేశంలోని మొత్తం డిపాజిట్లలో 80 శాతం వాటా కలిగిన బ్యాంకులు ఈ రాయితీ ప్రీమియంల వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకింగ్ రంగానికి మొత్తంగా 3 బేసిస్‌ పాయింట్లు లాభం చేకూరవచ్చు.

టైర్-1 బ్యాంకులపై ప్రభావం

షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు (ఆర్‌ఆర్‌బీలు మినహా) వర్తించే టైర్-1 మోడల్ ప్రకారం ‘ఏ’ కేటగిరీ బ్యాంకుల ప్రీమియం రూ.100కి 8 పైసలకు తగ్గుతుంది. అంటే గతంలో కంటే నేరుగా 33.33 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా, వింటేజ్ ఆధారిత ప్రోత్సాహకం కింద మరో 25 శాతం వరకు ప్రీమియం తగ్గే అవకాశం ఉంది.

రూ. 5 లక్షల పరిమితి పెరుగుతుందా?

ప్రస్తుతం ఒక బ్యాంకులో ఖాతాదారుడికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంది. కొత్త ధరల నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఈ బీమా పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రిస్క్ ఆధారిత ప్రీమియం వల్ల బ్యాంకులపై పడే అదనపు భారాన్ని ఈ రాయితీలు భర్తీ చేస్తాయని ఐసీఆర్‌ఏ పేర్కొంది.

ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)