Breaking News

యూపీఐతో ‘క్రెడిట్‌ లైన్‌’ వినియోగం

Published on Tue, 09/05/2023 - 04:43

న్యూఢిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ప్రయోజనాల పరిధిని మరింత పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెస్తోంది. బ్యాంకులు కస్టమర్లకు మంజూరుచేసే ‘ప్రీ–శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్స్‌’నూ యూపీఐ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, సేవింగ్స్‌ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాలు, ప్రీపెయిడ్‌ వాలెట్లు,  క్రెడిట్‌ కార్డ్‌లను యూపీఐకి లింక్‌ చేయవచ్చు. ఇకపై ‘ప్రీ–శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్స్‌’నూ యూపీఐకి అనుసంధానం చేయడానికి వీలవుతుంది. ప్రీ–శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్‌ అంటే– బ్యాంకులు రుణ గ్రహీతకు ముందస్తుగా మంజూరుచేసే రుణ సదుపాయం. 

రుణగ్రహీత ఏ సమయంలోనైనా వినియోగించుకోగలిగే ముందస్తు ఆమోదిత (పరిమితి) రుణం. ఇది క్రెడిట్‌ చెల్లింపు లాంటిది. దీని కింద (క్రెడిట్‌ లైన్‌) తుది వినియోగదారు రుణాన్ని వడ్డీతో తర్వాత తేదీలో తిరిగి చెల్లించవచ్చు. ఈ సదుపాయాన్ని పొందేందుకు యూపీఐ వినియోగదారులు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  మొబైల్‌ ద్వారా తక్షణ నగదు బదిలీ కోసం ఉపయోగించే యూపీఐ  లావాదేవీలు ఆగస్టులో  10 బిలియన్‌ మార్కును దాటాయి. జూలైలో యూపీఐ లావాదేవీల సంఖ్య 9.96 బిలియన్లు (996.4 కోట్లు). జూన్‌లో 9.33 బిలియన్లు.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)