Breaking News

‘పేటీఎం’ కస్టమర్లకు సాయం చేయండి

Published on Sat, 02/24/2024 - 04:35

ముంబై: యూపీఐ హ్యాండిల్‌ ‘పేటీఎం’ను ఉపయోగిస్తున్న పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌) కస్టమర్లను 4–5 వేరే బ్యాంకులకు మార్చే అవకాశాలను పరిశీలించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ)కి ఆర్‌బీఐ సూచించింది. తద్వారా చెల్లింపుల వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని, కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా సహాయం చేయాలని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు గాను మార్చి 15 నుంచి దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సంస్థ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. పీపీబీఎల్‌ వెబ్‌సైట్‌ ప్రకారం 30 కోట్ల వాలెట్లు, 3 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ఉన్నారు. దేశీయంగా రిటైల్‌ చెల్లింపులు, సెటిల్మెంట్‌ వ్యవస్థను ఎన్‌పీసీఐ నిర్వహిస్తోంది. వేరే బ్యాంకులకు ‘పేటీఎం’ హ్యాండిల్‌ను మైగ్రేట్‌ చేసే క్రమంలో పేమెంట్‌ సరీ్వస్‌ ప్రొవైడర్లుగా (పీఎస్‌పీ) 4–5 బ్యాంకులను ఎన్‌పీసీఐ ఎంపిక చేయొచ్చని సూచించింది.

తద్వారా ఒకే బ్యాంకుపై ఆధారపడితే తలెత్తే రిస్కులు తగ్గుతాయని తెలిపింది. ‘పేటీఎం’ హ్యాండిల్‌ను ఉపయోగిస్తున్న కస్టమర్లు, వ్యాపారుల హ్యాండిల్స్‌కు మాత్రమే మైగ్రేషన్‌ వర్తిస్తుందని, వేరే యూపీఐ అడ్రస్‌లు ఉన్నవారికి అవసరం లేదని పేర్కొంది. పీపీబీఎల్‌లో ఖాతాలు ఉన్న వారు మార్చి 15లోగా వేరే బ్యాంకులకు మారేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మరోసారి సూచించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)