Breaking News

ఇక మైనర్లే బ్యాంక్‌ ఖాతాలు నిర్వహించుకోవచ్చు: ఆర్‌బీఐ 

Published on Tue, 04/22/2025 - 06:56

ముంబై: పిల్లలు బ్యాంక్‌ సేవింగ్స్‌/డిపాజిట్‌ ఖాతాల ప్రారంభం, నిర్వహణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదేళ్లు నిండిన వారు (మైనర్లు) బ్యాంక్‌ ఖాతాలు తెరిచేందుకు, సొంతంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్‌లకు ఆర్‌బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ దిశగా సవరించిన నిబంధనలను ఆర్‌బీఐ విడుదల చేసింది.

ఏ వయసు మైనర్లు అయినా తమ తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల ద్వారా సేవింగ్స్, టర్మ్‌ డిపాజిట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు వాణిజ్య బ్యాంక్‌లు, కోపరేటివ్‌ బ్యాంక్‌లకు జారీ చేసిన సర్క్యులర్‌లో ఆర్‌బీఐ పేర్కొంది.

బ్యాంక్‌లు తమ రిస్క్‌ నిర్వహణ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పదేళ్లు నిండిన మైనర్లు సేవింగ్స్, టర్మ్‌ డిపాజిట్‌ ఖాతాలను తెరిచి, స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు అనుమతించొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలను ఖాతాదారులకు ముందుగానే తెలియజేయాలని పేర్కొంది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, ఏటీఎం/డెబిట్‌ కార్డులు, చెక్‌బుక్‌ సదుపాయాలను సైతం మైనర్‌ ఖాతాదారులకు ఆఫర్‌ చేయొచ్చని తెలిపింది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)