Breaking News

ఎగవేతదారులతో సెటిల్మెంట్‌

Published on Tue, 06/13/2023 - 04:47

ముంబై: మొండిపద్దుల నుంచి బ్యాంకులు సాధ్యమైనంత ఎక్కువగా రాబట్టుకునేందుకు వీలు కల్పించడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ దృష్టి పెట్టింది. ఉద్దేశపూర్వక ఎగవేతలు, మోసపూరిత ఖాతాల విషయంలో రాజీ కుదుర్చుకుని, మొండిబాకీలను సెటిల్‌ చేసుకోవడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం రాజీ సెటిల్మెంట్లను చేపట్టే క్రమంలో ఉద్దేశపూర్వక ఎగవేతలు, సాంకేతిక రైటాఫ్‌ల అంశాల్లో పాటించాల్సిన ప్రక్రియలకు సంబంధించి బోర్డు ఆమోదిత పాలసీలను నియంత్రిత సంస్థలన్నీ (ఆర్‌ఈ) అమలు చేయాల్సి ఉంటుంది. ఏయే పరిస్థితుల్లో రాజీ యత్నాలు చేయవచ్చనేది వాటిలో నిర్దిష్టంగా పేర్కొనాలి. కనీస బాకీ వ్యవధి, తనఖా పెట్టిన ఆస్తుల విలువ కరిగిపోవడం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి.

నోటిఫికేషన్‌ అంశాలు..
► ఇలాంటి కేసుల్లో ఉద్యోగుల జవాబుదారీతనాన్ని పర్యవేక్షించేందుకు తగు వ్యవస్థ ఉండాలి. బాకీ పరిమాణం, కాలపరిమితులు మొదలైనవి బోర్డు నిర్ణయిస్తుంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు లేదా మోసపూరిత ఖాతాలంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో, రుణదాతలపై క్రిమినల్‌ చర్యలతో సంబంధం లేకుండా, ఆర్‌ఈలు రాజీ సెటిల్మెంట్‌ చేసుకోవచ్చు.  
► రాజీ సెటిల్మెంట్‌ విషయంలో తనఖా ఉంచిన ఆస్తి (ఏదైనా ఉంటే) నుంచి ప్రస్తుతం రాబట్టుకోగలిగే మొత్తాన్ని సముచిత రీతిలో మదింపు చేసి, ఎంత మొత్తం వదులుకోవచ్చు, ఎంతకు సెటిల్‌ చేసుకోవచ్చు అనే నిబంధనలను పాలసీలో పొందుప ర్చాలి. తనఖా పెట్టిన వాటి నుంచి రాబట్టుకోగలికే విలువను లెక్కించే విధానాన్ని కూడా నిర్దేశించాలి.
► ఆర్‌ఈకి ప్రయోజనం చేకూర్చేలా మొండిబాకీల నుంచి తక్కువ ఖర్చులో, అత్యధికంగా రాబట్టాల నేది లక్ష్యంగా ఉండాలి.రాజీ సెటిల్మెంట్‌ చేసుకున్న రుణగ్రహీతలకు ఆర్‌ఈలు నిర్దిష్ట వ్యవధి తర్వాతే మళ్లీ కొత్తగా రుణాలివ్వడానికి వీలుంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)