Breaking News

తండ్రిని ఇంట్లో నుంచి గెంటేసి తాజాగా ఆశీస్సులు కోరిన వైనం

Published on Thu, 03/21/2024 - 12:22

నవాజ్‌మోదీ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించి వార్తల్లోకెక్కిన రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తాజాగా తన తండ్రి విజయపత్ సింఘానియాను కలిశారు. తండ్రి ఇంటికి వెళ్లి ఆశీస్సులు కోరినట్లు ఈమేరకు గౌతమ్‌ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.

‘ఈరోజు నాన్నగారు ఇంట్లో ఉండడం, ఆయన ఆశీస్సులు కోరడం సంతోషంగా ఉంది. నాన్న ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని గౌతమ్ సింఘానియా తన తండ్రితో ఉన్న చిత్రాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. 

2015లో గౌతమ్‌కు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించారు. అనంతరం తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా  బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయ్‌పత్‌ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్నీ ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. తాజాగా గౌతమ్‌ తండ్రి ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: వాట్సప్‌ స్టేటస్‌ పెడుతున్నారా..? అదిరిపోయే అప్‌డేట్‌ మీ కోసమే!

కొద్ది రోజుల క్రితం రేమండ్‌ ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌ గౌతమ్‌ సింఘానియా తన భార్య నవాజ్‌ మోదీతో 32 ఏళ్లు వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గౌతమ్‌ సింఘానియా ప్రకటించారు. తాము వేర్వేరు దారుల్లో ప్రయణిస్తున్నట్లు చెప్పారు. దాంతో విడాకులకు సైతం దరఖాస్తు చేశారు. విడాకులు వ్యవహారం సాఫీగా జరిగేలా గౌతమ్ సింఘానియాకు చెందిన రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటాను కుమార్తెలు నిహారిక, నిషాతో పాటు తన కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తన మద్దతు కోడలికేనంటూ విజయ్‌పత్‌ సింఘానియా గతంలో తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)