Breaking News

వడ్డీ రేట్ల తగ్గింపు తొందరపాటే

Published on Sat, 10/19/2024 - 04:14

న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల విషయమై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వడ్డీ రేట్లను ఈ దశలో తగ్గించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని, ఇది చాలా చాలా రిస్క్‌గా మారుతుందన్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయిలోనే కొనసాగుతోందంటూ, భవిష్యత్‌ ద్రవ్యపరమైన నిర్ణయాలు డేటా ఆధారంగానే ఉంటాయని సంకేతం ఇచ్చారు. 

ఈ నెల మొదట్లో జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించడం తెలిసిందే. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, మానిటరీ పాలసీ విధానాన్ని తటస్థానికి సడలించింది. తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్‌ 6న జరగనుంది. బ్లూంబర్గ్‌ నిర్వహించిన ఇండియా క్రెడిట్‌ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఈ అంశాలను ప్రస్తావించారు. 

సెపె్టంబర్‌ నెలకు ద్రవ్యోల్బణం అధికంగా ఉందంటూ, తదుపరి నెల గణాంకాల్లోనూ ఇదే తీరు ఉంటుందని, ఆ తర్వాత మోస్తరు స్థాయికి దిగి రావొచ్చన్నారు. కనుక ఈ దిశలో రేట్ల కోత ఎంతో తొందరపాటు అవుతుంది. ద్రవ్యోల్బణం 5.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం చాలా చాలా రిస్‌్కగా మారుతుంది’’అని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ పోలీసు మాదిరిగా వ్యవహరించకూడదంటూ.. ఫైనాన్షియల్‌ మార్కెట్లపై కఠిన నిఘా కొనసాగిస్తూ, అవసరమైనప్పుడు నియంత్రణపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నవి ఫిన్‌సర్వ్, ఆశీర్వాద్‌ మైక్రో ఫైనాన్స్‌ తదితర సంస్థలపై తాజాగా ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో దాస్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)