Breaking News

'రతన్ టాటా'కు ప్రతిష్టాత్మక అవార్డు

Published on Tue, 03/19/2024 - 18:27

దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా.. దాతృత్వంలో కూడా తనకు తానే సాటి. ఈయన చేసిన సేవలకుగానూ ఇటీవల ప్రతిష్టాత్మకమైన 'పీవీ నరసింహారావు స్మారక అవార్డు' లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను టాటా మోటార్స్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు మీద అందించే ఈ స్మారక పురస్కారం.. సామాజిక సంక్షేమం, మానవతా దృక్పథం పట్ల అసాధారణమైన అంకితభావాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు అందిస్తారు. ఈ అవార్డు మార్చి 15న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటా పొందారు.

బిలియన్ల కొద్దీ విరాళాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. టాటా ట్రస్ట్‌ల కింద వ్యక్తిగత స్థాయిలో లక్షల రూపాయల విరాళాలు అందించారు. రతన్ టాటా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి సహా వివిధ రంగాలకు విరివిగా విరాళాలు అందించారు. కాగా తాజాగా ఈయన పెంపుడు జంతువుల కోసం రూ. 165 కోట్లు వెచ్చించి టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ పేరుతో హాస్పిటల్ నిర్మించారు.

ప్రస్తుతం రతన్ టాటా.. టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పటికే ఈయన భారతదేశ అత్యుత్తమ పురస్కారాలైన పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) పొందారు. కాగా ఇప్పుడు పీవీ నరసింహారావు స్మారక అవార్డును సొంతం చేసుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)