Breaking News

ర్యాపిడో ఇక ‘యూనికార్న్‌’..

Published on Fri, 09/06/2024 - 17:18

దేశంలో ప్రముఖ రైడ్‌-షేరింగ్‌ సంస్థ ‘రాపిడో’ మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తోంది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సిరీస్‌-ఈ ఫండింగ్‌లో ఇన్వెస్టర్ల నుంచి 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,680 కోట్లు) నిధులు సమీకరణకు హామీ అందుకున్నట్లు ర్యాపిడో తెలిపింది.

ఈ తాజా పెట్టుబడులతో రాపిడో విలువ 110 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9,236 కోట్లు) పెరిగింది. యానికార్న్‌ క్లబ్‌లో చేరింది. ఒక బిలియన్‌ డాలర్ల విలువను సాధించిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. కొత్తగా సేకరించిన నిధులను దేశం అంతటా రాపిడో  కార్యకలాపాలను విస్తరించడానికి, సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి వినియోగిస్తామని కంపెనీ పేర్కొంది.

బైక్‌ ట్యాక్సీ సర్వీస్‌గా 9 సంవత్సరాల క్రితం ర్యాపిడో ప్రారంభమైంది. పవన్‌ గుంటుపల్లి, అరవింద్‌ శంఖ, రుషికేష్‌లు 2015లో దీన్ని స్థాపించారు. ఏడాదికేడాది 150% పైగా వృద్ధితో దేశంలో షేర్డ్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా దాని స్థానాన్ని పటిష్టం చేసుకుంది. మొదట్లో బైక్-టాక్సీలపై దృష్టి సారించిన కంపెనీ, ఆ తర్వాత ఆటో, క్యాబ్ సేవలను విస్తరించింది. దేశంలోని 100 కుపైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

#

Tags : 1

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)