Breaking News

ర్యాపిడోకి భారీ జరిమానా.. కొంప ముంచిన యాడ్స్‌

Published on Fri, 08/22/2025 - 08:28

తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలకు గాను రైడ్‌ సేవల సంస్థ ర్యాపిడోకి వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. ‘5 నిమిషాల్లో ఆటో లేదా రూ. 50 పొందండి ‘ ఆఫర్‌ కింద పరిహారం లభించని కస్టమర్లకు రీయింబర్స్‌ చేయాలని కూడా ఆదేశించింది.

దీనితో పాటు ‘గ్యారంటీడ్‌ ఆటో‘ ఆఫర్‌ ప్రకటనలను కూడా పరిశీలించిన సీసీపీఏ, ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించే తప్పుడు అడ్వర్టైజ్‌మెంట్లుగా నిర్ధారించింది. హామీ ఇచ్చినట్లుగా రూ. 50 డబ్బు రూపంలో కాకుండా రూ. 50 వరకు విలువ చేసే ర్యాపిడో కాయిన్ల రూపంలో లభిస్తాయన్న విషయాన్ని చాలా చిన్నని, చదవడానికి అనువుగా లేని ఫాంట్లలో కంపెనీ డిస్‌ప్లే చేసిందని సీసీపీఏ విచారణలో తేలింది.

పైపెచ్చు ఆ మొత్తాన్ని బైక్‌ రైడ్స్‌ కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడు రోజుల వ్యవధిలో ఉపయోగించుకోకపోతే కాలపరిమితి తీరిపోతుంది. అంతేగాకుండా ఈ హామీ బాధ్యతను కంపెనీ తన మీద పెట్టుకోకుండా వ్యక్తిగత డ్రైవర్ల మీదకు నెట్టేసినట్లు విచారణలో తేలింది. నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌ డేటా ప్రకారం 2024 జూన్‌ నుంచి 2025 జూలై మధ్య కాలంలో ర్యాపిడోపై ఫిర్యాదులు 1,224కి ఎగిశాయి. అంతక్రితం 14 నెలల వ్యవధిలో 575 కంప్లైట్లు నమోదయ్యాయి.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)