Breaking News

వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..

Published on Wed, 03/05/2025 - 08:45

ఉద్యోగుల మొదటి ప్రాధాన్యం వేతనానికే అనుకుంటాం. కానీ, అలా అనుకోవడం పొరపాటే అవుతుంది. వేతనం కంటే పనిచేసే చోట సానుకూల పరిస్థితులు, నేర్చుకునే, ఎదిగే అవకాశాలకు ఎక్కువ మంది ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు రాండ్‌స్టాడ్‌ నిర్వహించిన ‘ఇండియా వర్క్‌ మానిటర్‌ 2025’(Randstad Workmonitor 2025) సర్వేలో తెలిసింది. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  • పనిలో సౌలభ్యం లేకపోతే ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెబుతామని 52 శాతం మంది చెప్పారు.

  • సౌకర్యవంతమైన పనివేళలు లేని ఉద్యోగాన్ని తిరస్కరిస్తామని 60 శాతం మంది తెలిపారు.

  • పనిచేసే ప్రదేశం అనుకూలంగా లేకపోతే ఆ ఉద్యోగాన్ని కాదనుకుంటామని 56 శాతం మంది చెప్పారు.  

  • తమ మేనేజర్‌తో మంచి సంబంధాలు లేకపోతే ఉద్యోగాన్ని వీడుతామని 60 శాతం మంది తెలిపారు.

  • తాము చేసే ఉద్యోగంలో నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం లేకపోతే దాన్ని వదులుకుంటామని 67 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా ఇదే అభిప్రాయం చెప్పిన వారు 41 శాతమే.

  • దేశీయంగా 69 శాతం మంది ఉద్యోగులు సమష్టి పని సంస్కృతిని కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా 55 శాతం మందిలో ఇదే భావన నెలకొంది.

  • తమ విలువలకు సరిపడని సంస్థలో పనిచేయబోమని 70% మంది తేల్చిచెప్పారు.

  • పనిలో ప్రయోజనాలుంటే (పనివేళల్లో, పని ప్రదేశాల్లో వెసులుబాట్లు) యాజమాన్యాలను విశ్వసిస్తామని 73 శాతం మంది సర్వేలో తమ 
    అభిప్రాయాన్ని తెలిపారు.  

ఇదీ చదవండి: రిలయన్స్‌కు రూ.24,500 కోట్ల డిమాండ్‌ నోటీసులు

యాజమాన్యాలు మారాల్సిందే..

పని ప్రదేశాల్లో వస్తున్న మార్పులకు ఈ సర్వే ఫలితాలు అద్దం పడుతున్నట్టు రాండ్‌స్టాడ్‌ సర్వే నివేదిక తెలిపింది. ‘జెన్‌ జెడ్‌ లేదా మిలీనియల్స్‌ అయినా వ్యక్తిగత కట్టుబాట్లు, కెరీర్‌ వృద్ధిని సమతుల్యం చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో (స్వేచ్ఛగా) పనిచేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిలో నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారంటే, వారు కేవలం ఉద్యోగాలనే కోరుకోవడం లేదు. కెరీర్‌ పురోగతిని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. యాజమాన్యాలు ఈ మార్పును తప్పకుండా గుర్తించి, నిపుణులైన మానవ వనరుల అంచనాలను అందుకునే వ్యూహాలను రూపొందించుకోవాలి. లేదంటే నిపుణులను కోల్పోవాల్సి వస్తుంది’ అని రాండ్‌స్టాడ్‌ ఇండియా ఎండీ, సీఈవో విశ్వనాథ్‌ పీఎస్‌ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)