బిలియన్‌ డాలర్ల ఆదాయం

Published on Wed, 12/24/2025 - 02:06

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏటా సుమారు 30 శాతం వృద్ధితో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 9,000 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సీఈవో సునీల్‌ నాయర్‌ తెలిపారు. ప్రస్తుతం ఇది దాదాపు రూ. 2,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం దాదాపు రూ. 10,000 కోట్లుగా ఉన్న ఆర్డర్ల విలువను రూ. 30,000 కోట్ల స్థాయికి పెంచుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా రెండు విభాగాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు నాయర్‌ వివరించారు.

నీరు–వ్యర్థ జలాలకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, పారిశ్రామిక పార్క్‌లపై ఫోకస్‌ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే,  రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు నాయర్‌ తెలిపారు. ఇప్పుడు దాదాపు రెండున్నరేళ్లకు సరిపడా ఆర్డర్‌ బుక్‌ ఉన్నట్లు ఆయన వివరించారు. దేశీయంగా 1 బిలియన్‌ డాలర్లు, అంతర్జాతీయంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై కసరత్తు జరుగుతోందన్నారు. ఆదాయాల్లో ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌) వాటా 45 శాతంగా, బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌) వాటా 25 శాతంగా ఉందని నాయర్‌ చెప్పారు. 

కొత్త విభాగాలపై దృష్టి.. 
ప్రధాన వ్యాపారానికి అనుబంధంగా ఉండేలా డేటా సెంటర్లు, పర్యావరణహిత ఏవియేషన్‌ ఇంధనంలాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నాయర్‌ తెలిపారు. మరోవైపు, డివిడెండు పాలసీ కూడా పరిశీలనలో ఉందని సంస్థ సీఎఫ్‌వో స్రవంత్‌ రాయపూడి చెప్పారు. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా పూర్తి గా చెల్లించివేసి రుణరహిత సంస్థగా కంపెనీ మారిందని ఆయన వివరించారు. ప్రాజెక్టులు బట్టి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్‌పీవీ)కి సంబంధించి మాత్రమే రుణం తీసుకుంటున్నట్లు స్రవంత్‌ తెలిపారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ లో గోదావరి జలాలను నింపేందుకు ఉద్దేశించి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై, సీవరేజ్‌ బోర్డ్‌ నుంచి దక్కించుకున్న రూ. 2,085 కోట్ల భారీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నాయర్‌ చెప్పారు.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)