Breaking News

కమర్షియల్ టైర్‌ విభాగంలోకి రాల్సన్ టైర్స్

Published on Tue, 01/21/2025 - 19:13

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రముఖ టైర్ల తయారీ సంస్థ 'రాల్సన్ టైర్స్' (Ralson Tyres) హై-పెర్ఫార్మెన్స్ కమర్షియల్ టైర్‌లను లాంచ్ చేసింది. సైకిల్ టైర్లతో భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ కంపెనీ.. దేశీయ విఫణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కమర్షియల్ టైర్ల విభాగంలోకి కూడా అడుగుపెట్టింది.

టైర్ల విభాగంలో 50 ఏళ్ల చరిత్ర ఉన్న రాల్సన్ టైర్స్.. ఇప్పుడు తన కమర్షియల్ టైర్లను ఇండోర్‌లోని తయారీ కేంద్రంలో తయారు చేయనుంది. ఇప్పటి వరకు చిన్న టైర్లు మాత్రమే తయారైన ఈ ప్లాంట్‌లో పూర్తి స్థాయిలో పెద్ద టైర్ల ఉత్పత్తి జరగనుంది. ఈ టైర్లను భారతదేశంలో విక్రయించడంతో పాటు.. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంతో సహా ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేయనుంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

భారతదేశంలో టైర్ ఎగుమతి విలువను 2030 నాటికి ఐదు బిలియన్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇండోర్ ఫెసిలిటీలో తయారు చేసిన టైర్లను ఇప్పటికే 170 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు కమర్షియల్ విభాగంలో కూడా కంపెనీ తన హవా చాటుకోవడానికి సిద్ధమైంది.

భారత వాణిజ్య టైర్ల మార్కెట్ గణనీయమైన వృద్ధి చెందుతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాల్సన్ టైర్స్ పెద్ద టైర్లను తయారు చేయడానికి పూనుకుంది. ఈ విభాగంలో కూడా కంపెనీ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లకు ప్రయోజనాలను చేకూర్చుతూ ముందుకు సాగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

హై-పెర్ఫార్మెన్స్ కమర్షియల్ టైర్‌లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ 'మంజుల్ పహ్వా' (Manjul Pahwa) మాట్లాడుతూ.. మా ప్రీమియం శ్రేణి వాణిజ్య టైర్లను భారత మార్కెట్‌కు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టైర్లు అత్యుత్తమ నాణ్యత, మన్నికతో.. వినియోగదారులకు ప్రయోజనాలను అందిస్తాయని అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)