ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్‌ రాజన్‌

Published on Wed, 11/20/2024 - 17:59

ప్రపంచంలో ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయని, అవి చాలా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ముఖ్యంగా దానివల్ల అమెరికాకు చాలా నష్టం కలుగుతుందన్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.

రోమ్‌లోని బ్యాంకోర్ ప్రైజ్ అవార్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రభుత్వ రుణాలు పెంచుకునే దేశాలకు భవిష్యత్తులో సంక్షోభాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దానివల్ల అప్పులు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇటీవలి ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల ‍ప్రభుత్వ రుణాలు అధికమవుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఇదో హెచ్చరిక. వచ్చే ఏడాది వైట్‌హైజ్‌ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు రుణాలు తగ్గించుకోవాలి’ అన్నారు.

ఇదీ చదవండి: గోల్డ్‌ లోన్‌ చెల్లింపు విధానంలో మార్పులు

ప్రపంచ ప్రభుత్వ రుణం ఈ ఏడాది చివరి నాటికి 100 ట్రిలియన్ డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 93% చేరుకుంటుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. యూఎస్‌ అప్పు దాదాపు 31 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణం మందగించడం, వడ్డీ రేట్లు తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వాలు రుణాలు క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తాయని రాజన్‌ అన్నారు. దేశాల అప్పులు పెరగడంవల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇతర దేశాల నుంచి రుణం పొందే అవకాశం ఉండదని చెప్పారు.

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)