Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
ట్రైన్ టికెట్ ఉంటే సరిపోదు.. ఇవి కూడా ఉండాల్సిందే!
Published on Tue, 09/29/2026 - 16:59
అక్టోబర్ 1 నుంచి 31 వరకు సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రత్యేక టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ తనిఖీలు కేవలం టికెట్ లేకుండా ప్రయాణించే వారికే మాత్రమే పరిమితం కావు. రాయితీ టికెట్లు, ప్రత్యేక రిజర్వేషన్ కోటాలు, రైల్వే పాసులు, గ్రూప్ బుకింగ్స్‌పైనా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రైల్వే స్టేషన్లతో పాటు.. లోకల్ రైళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తారు.
రాయితీ లేదా ప్రత్యేక కోటాలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ అర్హతను నిరూపించేందుకు తప్పకుండా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ వెంట తీసుకెళ్లాలి. ఆధార్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫొటో ఐడీ, గుర్తింపు పొందిన విద్యాసంస్థ ఇచ్చిన విద్యార్థి ఐడీ వంటి పత్రాలను ఉపయోగించవచ్చు. ఫోన్లో ఉన్న ఐడీ ఫొటో లేదా జిరాక్స్ కాపీ కంటే ఒరిజినల్ డాక్యుమెంట్ వెంట ఉంచుకోవడం మంచిది.
ఒకే టికెట్‌పై పలువురు ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. గ్రూప్ బుకింగ్‌లో టికెట్లో పేరు ఉన్న ప్రయాణికుల్లో కనీసం ఒకరు అవసరమైన ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ చూపించాలి. అలాగే ఈ-పాస్ లేదా ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ (PTO)తో ప్రయాణించే వారు కూడా ఒరిజినల్ ఐడీని వెంట ఉంచుకోవడంతో పాటు, ప్రయాణానికి ముందు వాటిని నిర్దేశించిన 'అథారిటీ టు ట్రావెల్'గా మార్చుకున్నారో లేదో చూసుకోవాలి.
టికెట్ తనిఖీల సమయంలో ప్రయాణికుల వద్ద ఉన్న టికెట్లు నిజమైనవేనా, వారు ఉపయోగిస్తున్న రాయితీ లేదా కోటాకు అర్హులేనా అనే విషయాలను అధికారులు పరిశీలిస్తారు. అన్‌రిజర్వుడ్ టికెట్లను కూడా తనిఖీ చేస్తారు. అవసరమైనప్పుడు టికెట్ నిజమైనదా కాదా తెలుసుకోవడానికి టికెట్ చెకింగ్ సిబ్బంది టీటీఈ యాప్‌ను కూడా ఉపయోగించనున్నారు. సరైన టికెట్ లేదా అవసరమైన పత్రాలు లేకపోతే రైల్వే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. 1.58 కోట్ల కార్డులు రద్దు?
Tags : 1