Breaking News

రైలు ప్రయాణికులకు శుభవార్త.. క్యూలో నిలబడకుండా జనరల్‌ టికెట్‌

Published on Fri, 04/26/2024 - 09:14

స్టేషన్‌లో క్యూలో నిలబడి టికెట్‌ తీసుకుంటున్న ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆ శాఖకు చెందిన యాప్‌లను కొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేస్తున్నారు. రైల్వేశాఖ గతంలోనే తీసుకొచ్చిన యూటీఎస్‌ (అన్‌రిజర్వుడ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) యాప్‌లో తాజాగా మార్పులు చేసింది.

రైలు ప్రయాణం చేయాలనుకున్నపుడు జనరల్‌ టికెట్‌ దొరకడం చాలా కష్టం. టికెట్‌కోసం క్యూలో నిలుచున్నా కొన్నిసార్లు ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైలు వెళ్లిపోయిన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాఅని ట్రెయిన్‌ వెళుతుంటే టికెట్‌ లేకుండా ఎక్కలేం. ప్రధానంగా సెలవులు, పండగలప్పుడు జనరల్‌ టికెట్‌ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైలుశాఖ యూటీఎస్‌ (అన్‌రిజర్వుడ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) యాప్‌ను గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు క్యూలో నిలుచోకుండా ఈ యాప్‌ ద్వారా జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అయితే స్టేషన్‌కు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది.

ఇదీ చదవండి: హార్లిక్స్‌ లేబుల్‌ తొలగింపు.. కారణం ఇదేనా..

తాజాగా రైలు ప్లాట్‌ఫామ్‌కు ఎంత దూరంలో ఉన్నా టికెట్‌ పొందేలా యాప్‌ను అప్‌డేట్‌ చేశారు. దాంతో ఇంట్లో ఉండగానే కంగారుపడకుండా జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకుని రైలు వచ్చే సమయానికి స్టేషన్‌కు వస్తే సరిపోతుంది. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. సరిగ్గా రైలు ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతుందనే సమయానికి అంటే ప్లాట్‌పామ్‌కు 50 మీటర్లు దూరంలో ఉన్నపుడు మాత్రం ఈ యాప్‌ పనిచేయదని గమనించాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)