Breaking News

రైల్వే టికెట్‌ కౌంటర్‌లో కొన్నా.. ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేసుకోవచ్చు

Published on Sat, 03/29/2025 - 13:31

రైల్వే టికెట్లను.. రైల్వే కౌంటర్లలో కొనుగోలు చేస్తే ఆన్‌లైన్‌లో IRCTC వెబ్‌సైట్ ద్వారా లేదా 139కి కాల్ చేసి రద్దు చేసుకోవచ్చు. అయితే టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్న తరువాత రీఫండ్ కోసం రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ కొత్త చొరవ వల్ల ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి ప్రత్యేకించి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది లక్షలాది మంది రైలు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుందని అన్నారు.

ఈ-టిక్కెట్లకు బదులుగా కౌంటర్ల నుంచి వెయిటింగ్ టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు రైలు బయలుదేరే ముందు స్టేషన్‌కు వెళ్లి టిక్కెట్లను రద్దు చేసుకోవాలా?.. అని బీజేపీ ఎంపీ మేధా విశ్రామ్ కులకర్ణి అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ పై విధంగా సమాధానం ఇచ్చారు.

ఇదీ చదవండి: మస్క్ కీలక నిర్ణయం.. ఏఐ స్టార్టప్‌కు X అమ్మకం!

గతంలో ప్రయాణికులు టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి, డబ్బు వాపసు తీసుకోవడానికి రైల్వే కౌంటర్లకు తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీనికోసం ప్రయాణికులు సమయాన్ని వృధా చేయాల్సి వచ్చేది. కొత్త ఆన్‌లైన్ టిక్కెట్ రద్దు వ్యవస్థ భారతీయ రైల్వే వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియను చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Videos

YSR ఘాట్ వద్ద వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు

AP: 20 ఏళ్ల పగ.. వేటాడి వెంటాడి హత్య

కొట్టుకుపోతున్న పాకిస్థాన్ ఇస్లామాబాద్ ను ముంచెత్తిన వరదలు

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

అడిగి అడిగి అలసిపోయాం.. అందుకే పోరాటంలోకి దిగాం

ఇంజన్ ఫెయిల్.. ఇండిగో ఫ్లైట్ కు తప్పిన ఘోర ప్రమాదం

ఎవరు పూల సుబ్బయ్య.. వెలిగొండకు ఆయన పేరు ఎందుకు!

తుక్కుగూడలో దారుణం.. ఆ రోజు రాత్రి జరిగింది ఇదే పోలీస్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!

విజయవాడలో CPS ఉద్యోగుల భారీ ర్యాలీ

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)