Breaking News

ఆర్‌బీఐ గవర్నర్‌గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే?

Published on Tue, 12/26/2023 - 20:47

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' ఇటీవల తాను గవర్నర్‌గా పనిచేస్తున్నప్పుడు ఎంత జీతం తీసుకునే వారనే విషయాలను అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రాజ్‌ షమానీ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో RBI గవర్నర్ల జీతాలు ఎలా ఉండేవని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ 'రఘురామ్ రాజన్' (Raghuram Rajan)ను అడిగిన ప్రశ్నకు, తాను గవర్నర్‌గా పనిచేసిన రోజుల్లో ఏడాదికి రూ. 4 లక్షలను జీతభత్యాలను పొందినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం గవర్నర్ల జీతాలు ఎలా ఉంటాయనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా ఉన్నపుడు ధీరూభాయ్ అంబానీ నివాసానికి దగ్గరగా ఉన్న 'మలబార్‌ హిల్స్‌' అనే పెద్ద ఇంట్లో తనకు నివాసం కల్పించినట్లు వెల్లడించారు. అది కేంద్రం నాకు అందించిన అతిపెద్ద ప్రయోజనం అని చెప్పారు.

2013 నుంచి 2016 మధ్య RBI గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ క్యాబినెట్ సెక్రటరీతో సమానమైన జీతాన్ని పొందినట్లు వెల్లడిస్తూ.. గవర్నర్ పదవి నుంచి బయటకు వచ్చిన తరువాత పెన్షన్ వంటివి రాలేదని వెల్లడించారు. పెన్షన్ రాకపోవడానికి కారణం, తాను సివిల్ సర్వెంట్‌లు కావడం వల్ల, సివిల్ సర్వీస్ నుంచి అప్పటికే పెన్షన్ రావడం అని కూడా వివరించారు. 

ఇదీ చదవండి: నష్టాల్లో ఇన్ఫోసిస్.. ఆ ఒక్కటే కారణమా..!

రఘురామ్ రాజన్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేసి బయటకు వచ్చిన తరువాత షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఫుల్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈయన 'బ్రేకింగ్ ది మౌల్డ్: రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్' అనే పేరుతో ఓ బుక్ కూడా లాంచ్ చేశారు.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)